Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

Jai Maa Durga: Episode 4



Jai Maa Durga Episode 4 - UTV Devotional
Prince Surath of Chandranagri is a descendant of Manu and he is the chosen one who will rebuild the destroyed temple of Durga. The story revolves around Surath and his consort, Sumukhi, the princess of neighboring Vijaydurg. Sumukhi is a devout worshipper of the goddess Durga.
Their parents decide to get them married and their chance meeting in the ruins of the temple is designed by divine forces, to inspire them rebuild the temple. This temple has been lying in complete ruins for a few centuries, and Surath's ancestors appear to him to make him aware of his duty, as does the goddess Durga, who appears on earth in the form of nine little girls. The love story is filled with a lot of dramatic plots. Surath is overthrown from the throne, and he meets the sage, Medha Rishi. The Rishi tells the prince the story of Durga and thus makes him a devout follower of the goddess, leading to a stronger motivation to rebuild the temple.
However, rebuilding will not be an easy task, since the evil forces will do anything in their power to hinder the process. It is the story of relationships, and how circumstances affect the relationships. The love story between Sumukhi and Surath goes through upheavals because of strong beliefs in honour and duty, and also betrayal and distrust. True love may or may not overcome all obstacles.
It is the story of devotion. Sumukhi turns to the unseen force whenever she is in trouble. So strong is her belief that the goddess makes herself visible to her in the form of nine little girls. Sumukhi knows that she is always protected by the creator of the universe.

SrI nagajAtanayam - శ్రీనగజాతనయం

చిత్రం : వాగ్దానం(vAgdAnam) (1961)
రచన : శ్రీశ్రీ(SrISrI)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు(peNDyAla nAgESwararao)
గానం : ఘంటసాల(ghanTasAla)


శ్లోకం :
శ్రీనగజాతనయం సహృదయం (2)
చింతయామి సదయం
త్రిజగన్మ హోదయం
శ్రీనగజాతనయం
వచనం :
శ్రీరామభ క్తులారా! ఇది సీతాకళ్యాణ సత్కథ. నలభై రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తూంది. నాయనా! కాస్త పాలు, మిరియాలు ఏవైనా?
కోరస్ : చిత్తం. సిద్ధం.
వచనం :
భక్తులారా! సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధివీరుల్లో... అందరినీ ఆకర్షించిన ఒకే ఒక దివ్యసుందరమూర్తి... ఆహా! అతడెవరయ్యా అంటే
పాట :
రఘురాముడు రమణీయ
వినీల ఘనశ్యాముడు
రమణీయ వినీల తక ఘనశ్యాముడు
వాడు నెలరేడు సరిజోడు మొనగాడు
వాని కనులు మగమీల నేలురా
వాని నగవు రతనాల జాలురా
॥కనులు॥
వాని జూచి మగవారలైన మైమరచి
మరుల్కొనెడు మరోమరుడు
మనోహరుడు రఘురాముడు!
సనిదని సగరిగరి రిగరి
సగరి రిగరి సగగరి సనిదని
సగగరిస దని రిసనిద
రిసనిద నిదపమగరి
రఘురాముడు...
సనిసా సనిస సగరి రిగరి
సరిసనిసా పదనిసా
సనిగరి సనిస సనిరిస నిదని
నిదసని దపమ గామాదా
నినిని నిని నిని నిని
పస పస పస పస
సపా సపా సపా
తద్దిం తరికిటతక
రఘురాముడు రమణీయ
వినీల ఘనశ్యాముడు
శభాష్... శభాష్...
వచనం :
ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షము నుండి సీతాదేవి ఓరకంట చూచినదై... చెంగటనున్న
చెలికత్తెతో...
పాట :
ఎంత సొగసుగాడే (2)
మనసింతలోనె దోచినాడే
ఎంత సొగసుగాడే
మోము కలువరేడే... (2)
నా నోము ఫలము వీడే
శ్యామలాభిరాముని చూడగ
నా మది వివశమాయె నేడే
ఎంత సొగసుగాడే
వచనం :
ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయైయుండగా, అక్కడ స్వయంవర సభామంటపంలో జనకమహీపతి సభాసదులను చూచి...
పాట :
అనియె నిట్లు ఓయనఘులారా! నాయనుగు పుత్రి సీత
వినయాధిక సద్గుణవ్రాత ముఖవిజిత లలిత జలజాత
ముక్కంటి వింటినెక్కిడజాలిన
యెక్కటి జోదును నేడు
మక్కువ మీరగ వరించి
మల్లెలమాల వైచి పెండ్లాడు...
వచనం :
అని ఈ ప్రకారం జనకమహారాజు ప్రకటించగానే, సభలోని వారందరూ ఎక్కడివారక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రావ ణాసురుడు కూడా ‘హా ఇది నా ఆరాధ్య దైవమగు పరమేశ్వరుని చాపము. దీనిని స్పృశించుటయే మహాపాపము’ అని అనుకొనినవాడై వెనుదిరిగిపోయాడట. తదనంతరంబున
పాట :
ఇనుకుల తిలకుడు నిలకడ గల
క్రొక్కారు మెరుపువలె నిల్చి
తన గురువగు విశ్వామిత్రుని
ఆశీర్వాదము తలదాల్చి
సదమల మదగజ గమనము తోడ
స్వయంవరం వేదిక చెంత
మదన విరోధి శరాసనమును
తన కరమును బూనినయంత
గీత పద్యం :
ఫెళ్లుమనె విల్లు గంటలు ఘల్లుమనె
గుభిల్లుమనె గుండె సృపులకు
ఝల్లుమనియె జానకీ దేహము...
ఒక నిమేషమ్మునందె
నయము జయమును
భయము విస్మయము గదురా
శ్రీమద్రమారమణ గోవిందో హరి
వచనం :
భక్తులందరూ చాలా నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంది మరొక్కసారి...
శ్రీమద్రమారమణ గోవిందో హరి!
భక్తులారా! ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగము కావించినాడు.
అంతట -

కంద పద్యం :

భూతలనాథుడు రాముడు
ప్రీతుండై పెండ్లియాడె
పృథుగుణమణి... సంఘాతన్...
భాగ్యోపేతన్ సీతన్

కందార్థం :
భూతలనాథుడు రాముడు
ప్రీతుండై పెండ్లియాడె
శ్రీమద్రమారమణ గోవిందో హరి

Special Note:
ఈ హరికథా ప్రారంభంలో వచ్చిన శ్లోకం పూర్వం మన హరిదాసులు ఆలపించే సంస్కృత శ్లోకం. భూతలనాథుడు... అనే కంద పద్యం బమ్మెర పోతన రచించిన భాగవతం లోనిది. ‘ఫెళ్లుమనెవిల్లు...’ అనే గీత పద్యం కరుణశ్రీ రచించినదని శ్రీశ్రీ స్వయంగా తెలిపారు.
Download Audio:
SrI nagajAtanayam - శ్రీనగజాతనయం
SrI nagajAtanayam - శ్రీనగజాతనయం
వాగ్దానం(vAgdAnam) all songs

చిత్రం : శ్రీ రామాంజనేయ యుద్ధం(SrI rAmA~njanEya yuddam) (1975)
రచన : ఆరుద్ర(Arudra)
సంగీతం : కె.వి.మహదేవన్(K.V.mahadEvan)
గానం : పి.సుశీల, బి.వసంత(P.suseela,

పల్లవి :
శ్రీకరమౌ శ్రీరామ నామం
జీవామృతసారం
పావనమీ రఘురామ నామం
భవ తారకమంత్రం॥
దధిక్షీరమ్ములకన్నా ఎంతో
మధుర మధుర నామం
సదా శివుడు ఆ రజతాచలమున
సదా జపించే నామం
కరకుబోయ తిరగేసి పలికినా
కవిగా మలచిన నామం
రా... మరా... మరామ... రామ...
రామ రామ రామ రామ...॥
రాళ్లు నీళ్లపై చీల్చిన నామం
రక్కసి గుండెల శూలం॥
చరణం :
వేయి జపాల కోటి తపస్సుల
విలువ ఒక్కనామం
నిండుగ దండిగ వరములొసంగే
రెండక్షరముల నామం
ఎక్కడ రాముని భజన జరుగునో
అక్కడ హనుమకు స్థానం
చల్లని నామం మ్రోగే చోట
చెల్లదు మాయాజాలం
రామ రామ రామ సీతా
రామ రామ రామ రామ (2)॥
పల్లవి :
శ్రీయుతమౌ శ్రీరామ పాదం
శ్రీతజన మందారం
పావనమీ రఘురామ పాదం
పాపవినాశకరం
కలుషమ్ముల ప్రక్షాళన చేసే
గంగ చలించిన పాదం
అసురమదమ్మును పాతాళానికి
అణచివేసిన పాదం
రాతిని నాతిని చేసిన పాదం
అడవికి అందం పోసిన పాదం
నీ చరణమ్మే శరణమ్మనగా
ఇచ్చును పెన్నిధానం॥

చరణం :

అవలీలగ జలధిని దాటిన మేటి
పవనకుమారుడు పట్టే పాదం
బ్రహ్మేంద్రాదులు కొలిచే పాదం
పరబ్రహ్మ పదానికి మూలం
తాను ధరించిన పాదుకలకు
దర పట్టము కట్టిన పాదం
తమ్ముడు భరతుని తరతరాలకు
ధన్యుని చేసిన పాదం॥