Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

mEghamA nIlimEghamA - మేఘమా నీలిమేఘమా

చిత్రం : జర్నీ(Journey) (2012), రచన : సాహితి
సంగీతం : సత్య, గానం : కార్తీక్


పల్లవి :
మేఘమా నీలిమేఘమా
ఎదురుచూశా నీ పూలజల్లుకి
వర్షమా వలపుల వర్షమా
కాచుకున్నా నీ మొదటిముద్దుకి
కన్ను మూయలా
చెవి మూగలా
ముద్ద మింగలా నోట నవ్వలా
చెయ్యి ఊపలా కాలు కదపలా
ఆ విసుగులో ఏ మెరుగలా
ఓ మేఘమా మేఘమా ఎదురుచూశానే॥మేఘమా||
చరణం : 1
రోడ్‌లోన చూడాలా పార్క్‌లో చూడాలా
బస్‌లో చూడాలా ఆటోలో చూడాలా
థియేటర్‌లో చూడాలా స్ట్రీట్‌లో చూడాలా
చూశాను అల్లంత దూరంలో
గాలిలో నిలవాలా భూమిలో నిలవాలా
అక్కడ నిలవాలా ఇక్కడ నిలవాలా
నిలవాలా నిలవాలా ఎక్కడ నిలవాలా
నిలిచాను ఆ పిల్ల గుండెలో
నిలిచిందో పిలిచిందో వీధిలో
నే గమనించుకోలేదు మొదటిలో
నే ఎదురుచూశాలే పూలకొమ్మకి॥మేఘమా||
చరణం : 2
నంబరు అడగాలా ఫోను చెయ్యాలా
అడ్రసు అడగాలా లవ్ లెటర్ ఇవ్వాలా
ఫాలో చెయ్యాలా కబురు పంపాలా
ఎలా వచ్చిందో ఎదురులో
టీజింగ్ చెయ్యాలా జగడాలాడాలా
మిర్రిమిర్రి చూడాలా నవ్వుతూ మాట్లాడాలా
వీధిలో ఆపాలా చెయ్యే పట్టాలా
ఎట్లా పడ్డాది ప్రేమలో
నే క్యాచ్ చెయ్యి పోయేటి నవ్వుతో
నాకు మ్యాచయ్యి పోయింది లైఫులో
నే ఎదురుచూశాలే నా పూలకొమ్మకి
మేఘమా నీలిమేఘమా
నాకు నీ ప్రేమే కావాలిలే నువ్వే కావాలిలే॥మూయాలా॥
నాకు నీ ప్రేమే కావాలిలే...


Extra Songs:
Chitti Chitti ( Journey Telugu Movie )
Govinda ( Journey Telugu Movie )
Nee Pere Teliyadhugaa |With Lyrics |
MeghamA with Lyrics
Katha Mugisele with lyrics

chali champutunna - చలి చంపుతున్న

చిత్రం : క్షణక్షణం (kshaNa kshaNam)(1991)
రచన : సిరివెన్నెల, సంగీతం : ఎం.ఎం. కీరవాణి
గానం : ఎస్.పి.బాలు, చిత్ర
04 July - నేడు కీరవాణి బర్త్‌డే (keeravaNi Birthday)


సాకీ :
శ్రావణవీణ స్వాగతం...
స్వరాల వెల్లువ వెల్‌కమ్
లేత విరిబాలా నవ్వమ్మా ఆనందంలో
జుంబాయే హాగుంబహే జుంబాయే హాగుంబహే
జుంబాయే హాగుంబహే హైగో హైగో హైగో హై...॥జుంబాయే||
పల్లవి :
చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది
జుంబాయే హాగుంబహే ఆ జుంబాయే హాగుంబహే
చెలి చెంతకొచ్చే తళుక్కులో గిలిగింతగిచ్చింది
జుంబాయే హాగుంబహే ఆ జుంబాయే హాగుంబహే
వయసాగనిది రేగినది సరసములోన
చలిదాగనిది రేగినది సరసకు రానా
కల తీరదులే తెలవారదులే
ఇది చక్కని చిక్కని చక్కిలిగిలి ॥చలి చంపుతున్న||
చరణం : 1
అందిస్తున్నా వగరే చిరుచిగురే తొడిగే
చిందిస్తున్నా సిరులే మగసిరులే అడిగే
రమ్మంటున్నా ఎదలో తుమ్మెదలే పలికే
ఝుమ్మంటున్నా కలలో వెన్నెలలే చిలికే
గలగలమని తరగల తరగని కల కదిలిన కథలివిలే
కలకలమని కులుకుల అలకలుగని చిలికిన సుధలివిలే
చెలువనిగని కలువుల చెలువులుగని నిలువని మనసిదిలే
అలుపెరుగని అలరుల అలలనుగని
తలపులు తెలిపిన వలపుల గెలుపిదిలే
తలపడకిక తప్పదులే.. హే... హే... ॥చలి చంపుతున్న||
చరణం : 2
ఊకొట్టింది అడవే మన గొడవే వింటూ
జోకొట్టింది ఒడిలో ఉరవడులే కంటూ
ఇమ్మంటుంది ఏదో ఏదేదో మనసు
తెమ్మంటుంది ఎంతో నీకంతా తెలుసు
అరవిరిసిన తలపులు కురిసెను కల కలసిన మనసులలో
పురివిరిసిన వలపులు తెలిపెను
కథ పిలుపుల మలుపులలో
ఎద కొసరగ విసిరెను మధువుల వల
అదిరిన పెదవులలో
జత కుదరగ ముసిరెను అలకల అల
చిలకల పలుకులు చిలికిన చినుకులలో
తొలకరి చిరుజల్లులలో... హే... హే...॥॥చలి చంపుతున్న||
||జుంబాయే హాగుంబహే||

anubandham AtmIyata - అనుబంధం ఆత్మీయత

చిత్రం : తాత-మనవడు(tAta-manavaDu) (1973)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : రమేష్ నాయుడు
గానం : వి.రామకృష్ణ
03 July - నేడు ఎస్.వి.ఆర్. జయంతి
(S.V.R. Birthday)


పల్లవి :
అనుబంధం ఆత్మీయత
అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం
వింత నాటకం... ॥
చరణం : 1
ఎవరు తల్లి ఎవరు కొడుకు
ఎందుకు ఆ తెగని ముడి
కొన ఊపిరిలో ఎందుకు అణగారని అలజడి॥తల్లి॥
కరిగే కొవ్వొత్తిపై కనికరం ఎవ్వరికీ...
ఎవ్వరిరీ
అవి కాలుతున్నా... ఆ... అవి కాలుతున్నా
వెలుగులె కావాలి అందరికీ అందరికీ...॥
చరణం : 2
కొడుకంటూ నీకు ఒకడున్నాడు
వాడు గుండెను ఏనాడో అమ్ముకున్నాడు
నిన్ను కడసారైనా చూడ రాలేదు
వల్లకాటికైనా వస్తాడను ఆశలేదు
ఎవరమ్మా వినేది నీ ఆత్మఘోషను
ఏ తల్ల్లీ కనగూడదు ఇలాంటి కొడుకును
ఇలాంటి కొడుకును...॥
చరణం : 3
కానివారి ముచ్చటకై కలవరించు మూఢునికి
కన్నవారి కడుపుకోత ఎన్నడైన తెలిసేనా
తారాజువ్వల వెలుగుల
తల తిరిగిన ఉన్మాదికి
చితిమంటల చిటపటలు వినిపించేనా (2)॥


Watch tAta manavaDu Video Songs:

sOma mangala budha
EmiTO eelokamantha
rAyanTi nA moguDu | 1 |
nUkAlammanu nEnE
eenADE bAbu nI puTTinarOju

Listen tAta manavaDu Audio Songs:

tAtA manavaDu | 1 |