Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

Jai Jai GaNeSA - జై జై గణేశా

చిత్రం : జై చిరంజీవ (Jai ChiranjIva) (2005), రచన : చంద్రబోస్
సంగీతం : మణిశర్మ, గానం : ఎస్.పి.బాలు, బృందం


పల్లవి : ఓం... జై గణపతి జై జై జై గణపతి (4)
జై జై గణేశా జై కొడతా గణేశా
జయములివ్వు బొజ్జగణేశా గణేశా
హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా గణేశా
అభయమివ్వు బుజ్జిగణేశా గణేశా
లోకం నలుమూలలా లేదయ్యా కులాసా
దేశం పలువైపులా ఏదో రభస
మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేషా
పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా
చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి
చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా
గణేశా గమ్ గణపతి... గణేశా గమ్ గణపతి
గణేశా గమ్ గమ్ గమ్ గమ్ గణపతి
॥జై గణేశా॥
చరణం : 1

నందేమో నాన్నకి సింహం మీ అమ్మకి
వాహనమై ఉండలేదా
ఎలకేమో తమరికి నెమలేమో తంబికి
రథమల్లే మారలేదా
పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా
కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా
ఎందుకు మాకీ హింసామార్గం
ఎదిగేటందుకు అది ఆటంకం
నేర్పరా మాకు సోదరభావం
మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా
॥గమ్ గణపతి॥॥జై గణేశా॥
చరణం : 2

చందాలను అడిగిన దాదాలను దండిగా
తొండంతో తొక్కవయ్యా
లంచాలను మరిగిన
నాయకులను నేరుగా
దంతంతో దంచవయ్యా
ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ
మా సరుకుల ధరలన్నీ
దించాలయ్యా
మాలో చెడునే ముంచాలయ్యా
లోలో అహమే వంచాలయ్యా
నీలో తెలివే పంచాలయ్యా
ఇంతకుమించి కోరేందుకు లేదు దురాశ
॥గమ్ గణపతి॥॥జై గణేశా॥
గణపతి బప్పా మోరియా...
ఆధా లడ్డు ఖా లియా (4)

AkASam nI haddurA - ఆకాశం నీ హద్దురా

చిత్రం : సొమ్మొకడిది సోకొకడిది (sommokaDidi sOkokaDidi)(1978)
రచన : వేటూరి సుందరరామమూర్తి
సంగీతం : రాజన్-నాగేంద్ర, గానం : ఎస్.పి.బాలు


పల్లవి :
ఆకాశం నీ హద్దురా...
అవకాశం వదలద్దురా
పరువాల తొలిపొద్దులో...
హమేషా తమాషా చెయ్యరా...॥
చరణం : 1
నేల విడిచి సాములెన్నో చేయరా
మబ్బుల్లో మెరుపంతా నీదిరా
నిలబడి తాగే నీళ్లు చేదురా
పరుగెత్తై పాలు తాగరా
బ్రతుకంటే బస్తీ మే సవాలురా
ప్రపంచమే మాయాబజారురా (2)
హోయ్ గురిచూసి కొట్టాలిరా సిరి చూసి పట్టాలిరా
నీ ఎత్తు ఎదగాలంటే ఎత్తులు చిత్తులు వెయ్యరా
ఎత్తులు చిత్తులు వెయ్యరా॥
చరణం : 2
నుదుటిరాత నువ్వు మార్చిరాయరా
అందమైన అనుభవాలు నీవిరా
అనుకున్నది పొందడమే నీతిరా
మనకున్నది పెంచటమే ఖ్యాతిరా
మనిషి జన్మ మరువలేని ఛాన్సురా
ఈ రేసులో జాక్‌పాట్ కొట్టాలిరా (2)
సుడిలోకి దూకాలిరా
కడదాకా ఈదాలిరా
నీ ఒడ్డు చేరాలంటే
తడాఖా మజాకా చూపరా (2)॥

dhIramamIrE yamunA tIrE - ధీరసమీరే యమునా తీరే


చిత్రం : ధర్మచక్రం(dharmachakram) (1996)
రచన : వేటూరి, సంగీతం : ఎం.ఎం.శ్రీలేఖ
గానం : ఎస్.పి.బాలు, చిత్ర

15 September - నేడు రమ్యకృష్ణ బర్త్‌డే
(ramyakrishna Birth Day)




పల్లవి :
ధీరసమీరే యమునా తీరే
వసతివనే వనమాలి
గ్రామసమీపే ప్రేమకలాపే
చెలి తగునా రసకేళి
ఆకాశమే నా హద్దుగా
నీకోసమొచ్చా ముద్దుగా
తెచ్చానురా మెచ్చానురా గిచ్చేయి
నచ్చిన సొగసును॥
చరణం : 1
వేసంగి మల్లెల్లో సీతంగి వెన్నెల్లో
వేసారిపోతున్నారా రారా
హేమంత మంచుల్లో ఏకాంత మంచంలో
వేటాడుకుంటున్నానే నిన్నే
మొటిమ రగులు సెగలో
తిరగబడి మడమ
తగులు వగలో
చిగురు వణుకు చలిలో
మదనుడికి పొగరు
పెరిగె పొదలో
గోరింట పొద్దుల్లోన
పేరంటాలే ఆడే వేళ
ధీరసమీరే యమునా తీరే
వలచితి నే వనమాలి
గ్రామసమీపే ప్రేమకలాపే
ప్రియ తగునా రసకేళి
చరణం : 2
లేలేత నీ అందం నా గీత గోవిందం
నా రాధ నీవేలేవే రావే
నీ గిల్లికజ్జాలు జాబిల్లి వెచ్చాలు
నా ఉట్టి కొట్టేస్తున్నా రామా
వయసు తెలిసె ఒడిలో ఎద కరిగి
తపన పెరుగు తడిలో
మనువు కుదిhttp://www.blogger.com/img/blank.gifరె మదిలో ఇంకెపుడు చనువు
ముదురు http://www.blogger.com/img/blank.gifగదిలో
వాలారు సందెల్లోన వయ్యారాలే తాకే వేళ
ధీరసమీరే యమునా తీరే వలచితి నే వనమాలి
గ్రామసమీపే ప్రేమకలాపే
ప్రియ తగునా రసకేళి॥॥


Listen Audio Songs:

Dharmachakram | Link | Audio Songs |