chakkiligintala rAgam - చక్కిలిగింతల రాగం
chakkiligintala rAgam - చక్కిలిగింతల రాగం
చిత్రం : కొదమసింహం(kodama simham) (1990), రచన : వేటూరిసంగీతం : రాజ్-కోటి, గానం : ఎస్.పి.బాలు, చిత్ర
పల్లవి :
ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే
చెక్కిలి గుంటల గీతం
ఓ ప్రియా... యా యా యా...
ఎక్కడ దాచను అందం
నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే
చుక్కలు చూడని ప్రాయం
ఓ ప్రియా... యా యా యా...
సాయంత్రం వేళ సంపంగిబాల
శృంగారమాల మెళ్లోన వేసి
ఒళ్లోన చేరగా యా యా యా...॥॥
చరణం : 1
కౌగిట్లో ఆకళ్లు కవ్వించే పోకళ్లు
మొత్తంగా కోరిందమ్మా మోజు
పాలల్లో మీగళ్లు పరువాల ఎంగిళ్లు
మెత్తంగా దోచాడమ్మా లౌజు
వచ్చాక వయసు వద్దంటే ఓ యస్
గుచ్చెత్తి పిచ్చెక్కించే గుమ్మ సొగసు
ఊ అంటే తంటా...
ఊపందుకుంటా...
నీ అండ కన్నేసి నా గుండె వెన్నేసి
నీ ముద్దు నాటెయ్యాలీరోజు...
యా యా యా...॥॥
చరణం : 2
చూపుల్లో బాణాలు సుఖమైన
గాయాలు కోరింది కోలాటాల ఈడు
నీ ప్రేమగానాలు లేలేత దానాలు
దక్కందే పోనే పోడు వీడు
గిలిగింత గిచ్చుళ్లు పులకింత పొత్తిళ్లు
ముంగిట్లో ముగ్గేస్తుంటే నాకు మనసు
సయ్యంటే జంట... చెయ్యందుకుంటా...
బుడమేటి పొంగంటి బిడియాల బెట్టంతా
ఒడిలోనే దులిపేస్తాలే చూడు... యా యా యా...॥
Om sai SrIsAi - ఓం సాయి శ్రీ సాయి
Om sai SrIsAi - ఓం సాయి శ్రీ సాయి
చిత్రం : శిరిడిసాయి(shirdisai) (2012)రచన : మేడిచెర్ల, సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : మధుబాలకృష్ణ, సునీత, బృందం
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి (2)
సాయి... శిరిడి సాయి... శిరిడి సాయి...
శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం
సాయి కథ శ్ర వణం సకల పాప హరణం (2)
సాయి దివ్య చరణం భాగీరథీ సమానం (2)
సాయి దివ్యనామం భవతారక మంత్రం//శరణు//
చరణం : 1
యోగి వోలె భిక్షాటన చేసి
పాపాలకు జోలె పట్టె భిక్షువు
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
నీటితోనే జ్యోతులు వెలిగించి
తెరిపించెనులే జ్ఞానచక్షువు
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
రగిలే ధునిలో... చేతులు ఉంచి...
పసిపాపను ఆదుకున్న ఆత్మబంధువు//శరణు//
చరణం : 2
సేవించిన రోగుల దీవించి
వైద్యో నారాయణో హరియై నిలిచాడు
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
జన్మనిచ్చు తల్లికే ఊపిరులూది
పునర్జన్మ ప్రసాదించినాడు
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
తిరగలి విసిరి... వ్యాధిని కసిరి...
ఆపదనే తప్పించిన దీనబంధువు//శరణు//
ఎక్కడయ్యా సాయి ఏడనున్నావోయి
నడవలేకున్నాను ఎదురుపడవోయి
నిను చూడందే నా మనసు కుదుటపడదాయె
ఎపుడు చూసినా ఆత్మధ్యానమే కానీ
నీ ఆకలే నీకు పట్టదా
ఏ జన్మ బంధమో మనది...
ఏనాటి రుణమో ఇది...
పట్టవయ్యా సాయి...
చరణం : 3
ప్రతిరూపం తన ప్రతిరూపమని
మృగాలకే మోక్షమిచ్చె మౌని
పెను తుపానులే విరుచుకు పడగా
భీతిల్లిన ప్రజలే పరుగులిడగా
ఆగిపొమ్మని... ఆజ్ఞాపించినా...
గోవర్ధన గిరిధారి శిరిడి పుర విహారి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి (3)