Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

pOrA bAbU pO - పోరా బాబూ పో

చిత్రం : దీక్ష (Deeksha) (1951)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
గానం : ఎం.ఎస్.రామారావు


పల్లవి :
పోరా బాబూ పో... (2)
పోయి చూడు ఈ లోకం పోకడ
పోరా బాబూ పో...
ఆవేశాలను ఆశయాలను
వదిన కోసమే వదులుకొంటివా॥
ఆమెకు నీకు ఋణం తీరెగా
తెగించి చూడు తేలేదేమిటో॥బాబూ పో॥
చరణం : 1
ఉన్నవారు కాదన్నావో
ఊరు విడిచి పోతున్నావో
ఏ ఘనకార్యం సాధిస్తావో... (2)
ఏమౌతావో ఎవరికెరుకరా॥బాబూ పో॥
చరణం : 2
దూరపు కొండలు నునుపేనేమో
దోషం నీలో లేదో ఏమో
నీవు నమ్మిన నీతి న్యాయం (2)
నిజమౌనేమో తెలుసుకుందువో॥బాబూ పో॥
చరణం : 3
దేశసేవకై దీక్ష పూనమని
ధీరమాత దీవించెను నాన్న
కాకిని కోకిల చేస్తావో... (2)
లోకంలో ఒకడైపోతావో॥బాబూ పో॥

Its your love - ఇట్స్ యువర్ లవ్

చిత్రం : లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్(Life is beautiful) (2012)
రచన : అనంత శ్రీరామ్
సంగీతం : మిక్కీ జె.మేయర్, గానం : నరేష్ అయ్యర్


పల్లవి :
ఏమిటో ఏమిటో ఏమిటో
మెల్లగా లాగుతోంది ఏదో
కంటితో చూడలేనంత సన్న తీగతో
ఏమిటో ఏమిటో ఏమిటో
ముందుకే తోస్తుంది ఏదో
పువ్వుకీ తేనెకీ పుట్టినా పెదాలతో
నా గుండె లోన చక్కిలెందుకో
ఇన్ని వింతలకు కారణం మరేమిటో... ఓ...
ఇట్స్ యువర్ లవ్ ఇట్స్ యువర్ లవ్
ఇట్స్ యువర్ లవ్ ఆ ఆ... ఓ ఓ...
॥యువర్ లవ్‌॥॥
చరణం : 1
రివ్వున రాయె... రివ్వున రాయె...
రివ్వున రివ్వున రాయె రెక్కలు ఎత్తి సీతాకోకా
పువ్వుకి తొందరగుందే తేనెల భారం పెరిగాక
గుట్టుగా సప్పుడు సేయకా (2)
దాక్కొని పోకే వానా సినుకా
మట్టిలో ఒంటిగవుందే సిన్నారి మొలక
నే తన చెంత... ఓ క్షణమైనా...
నడకే సంబరంగా గడికో సందడేగా
బ్రతుకే పండగేగా కొడిగట్టని దివ్వెలుగా
॥యువర్ లవ్‌॥
చరణం : 2
ఎన్నెలా ఎన్నెల ఎండి
ఎన్నెలా ఎండ ఎందుకంటా
గుండెలో ఉన్నట్టుండి
యవ్వనమేదో ఎలిగిందా
మబ్బులో దిక్కులో నింగి సుక్కలో
లేని ఇంత
కొత్తగా కంటికి అలా వచ్చే ఎలుగంతా
నా హృదయాన ఈ అదురేంటో
మురిపించేది ఎవరో... మరిపించేది ఎవరో...
కదిలించేది ఎవరో... నులివెచ్చని అల్లరితో
॥గుండె లోన॥॥యువర్ లవ్‌॥
Its Your Love Full Song with Lyrics - Life is Beautiful Movie

nAtOnE nuvvu - నాతోనే నువ్వు

చిత్రం : వస్తాడు నా రాజు (vastADu nA rAju) (2010)
రచన : రామజోగయ్యశాస్త్రి
సంగీతం : మణిశర్మ, గానం : సాకేత్, సైంధవి


పల్లవి :
నాతోనే నువ్వు నాలోనే నువ్వు
ఐనా నువు నాతో లేవు॥
ఎక్కడ నేనున్నా
నా పక్కనే ఉంటావు
పక్కన ఉంటూనే
నన్ను ఒంటరి చేశావు
ఇప్పటికి ప్పుడు నిన్ను చూడాలనిపిస్తుంది
చెప్పక మిగిలిన మాటేదో చెబుదామనిపిస్తుంది॥
చరణం : 1
ఎన్నో అనుకున్నా ఏదీ నీతో అనలేదే
ఏవో కలలుగన్నా నీతో పంచుకోలేదే
సమయం కొనసాగదే హృదయం తనలాడదే
నువు లేకుంటే
మనసేమో పదే పదే నీతో జ్ఞాపకాలను
గురుతుకు తెస్తుందే
ప్రాణం నలిగిన ప్రేమకు ఇకపై
ఆశలన్నీ నీమీదే॥ప్పుడు॥॥
చరణం : 2
ప్రేమ తొలిప్రేమ
నీ చిరునామా ఏదంటూ
నిన్నే వెతుకుతున్నా నువ్వే దారి చూపించు
కసిరే నడిరాతిరి ఎటుగా నిను దాచినా చేరగలేనా
లోకం నలువైపులా ఆపే గిరిగీసిన
దూసుకు రాలేనా
జతగా నడిచిన నిన్నటి అడుగే నీకోసం వస్తున్నా॥ప్పుడు॥॥