Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

andAla rAkshasivE - అందాల రాక్షసివే

చిత్రం : ఒకేఒక్కడు(okE okkaDu) (1999)
రచన : ఎ.ఎం.రత్నం, శివగణేశ్
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : ఎస్.పి.బాలు, హరిణి

06 January - నేడు ఎ.ఆర్.రెహమాన్ బర్త్‌డే(A.R.Rehman Birth Day)

Know About A R rehman's:
Personal Life
Discography (1992 to Till Now)

పల్లవి :

అందాల రాక్షసివే గుండెల్లొ గుచ్చావే
మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే ॥
గడ్డి మొక్కకు కోత తెలియునా
బాలకొమరినే కానా
నీటి కొంగను చేప మింగునా జరుగునా
బైట పూసినా లోన కాసెడి
శనగతోటను మామా
మెలిక తిప్పుతూ కాయలొలిచెడి
తుంటరి సుమా
చిలకా రామచిలకా మొలకా ప్రేమమొలకా॥
చరణం : 1
సూర్యుణ్ణి రెండు చేసి కళ్లలోన దాచుకుందు
చందురుని కంటిపాపలోన తాను ఉంచుకుందు
రాతిరిని పట్టుకొచ్చి కాటుకల్లె పెట్టెదనా
మిణుగుర్లు అంటించి బుగ్గలకు నిగ్గు తేనా
పొగడి నను రెచ్చగొట్టి నిద్ర చెడగొట్టకయా
తలగడగ నాకొక్క పంచె నువు ఈయవయా
కనుల కునుకే కలయా...
చిలకా రామచిలకా మొలకా ప్రేమమొలకా॥
కొండపల్లి బొమ్మతోటి జంటచేరి
ఆడుకుందాం మొగలిపువ్వా (2)
చరణం : 2
తేనెపట్టు పట్టుబట్టి పాడుచెయ్య శపధమా
ప్రేమంటె పార్టీ విడిచి
పార్టీ మార్చు విషయమా
కన్నెపిల్ల సైగ చేస్తే తలక్రిందులవుదువా
నే నడుచు నీడలోన నీవుండ సమ్మతమా
నే కనక నీరైతే నీ నుదుటిపై నే జారి
అందాల నీ ఎదపై హుందాగ కొలువుంటా
కానీ అన్నీ కలలే
చిలకా రామచిలకా
మొలకా ప్రేమమొలకా॥॥మొక్కకు॥

nArayaNa mantram - నారాయణ మంత్రం

చిత్రం : భక్తప్రహ్లాద(Bhakta prahlAda) (1967)
రచన : సముద్రాల సీనియర్
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : పి.సుశీల, బృందం

పల్లవి :
ఓం నమో నారాయణాయ! (4)
నారాయణ మంత్రం
శ్రీమన్నారాయణ భజనం (2)
భవ బంధాలు పారద్రోలి
పరమునొసంగే సాధనం॥
చరణం : 1
గాలిని బంధించి హఠించి
గాసిల పనిలేదు (2)
జీవుల హింసించి
క్రతువుల చేయగ పనిలేదు
మాధవా మధుసూదనా అని
మనసున తలచిన చాలుగా॥॥
చరణం : 2
తల్లియు తండ్రియు నారాయణుడే
గరువు చదువు నారాయణుడే
యోగము యాగము నారాయణుడే
ముక్తియు దాతయు నారాయణుడే
భవ బంధాలు పారద్రోలి
పరమునొసంగే సాధనం॥
నాథ హరే... శ్రీనాథ హరే...
నాథ హరే... జగన్నాథ హరే...॥హరే॥



OM! namO ! nArAyaNAya!
nArAyaNA maMtraM  SrImannArAyaNa  BajanaM   ||nArA||
 
Bava baMdhAlU pAradrOlI
paramu nosaMgE  sAdhanaM
gAlini baMdhiMcI  haThiMcI gAsila panilEdu
jIvula  hiMsiMcI kratuvulA cEyaga panilEdu
mAdhavA! madhusUdanA!ani
manasuna  talacina   cAlugA                        ||nArA||
 
talliyu  taMDriyu  nArAyaNuDE!
guruvU  caduvU  nArAyaNuDE!
yOgamu  yAgamu   nArAyaNuDE!
muktiyu dAtayu nArAyaNuDE!
BavabaMdhAlU  pAradrOlI
paramu nosaMgE  sAdhanaM                 ||nArA||
 
nAdha harE! SrInAtha harE!
nAdhaharE jagannAdhaharE!

nidarE kala ayinadi - నిదరే కల అయినది

చిత్రం : సూర్య S/oకృష్ణన్ (2008)
రచన : వేటూరి
సంగీతం : హారీస్ జయరాజ్
గానం : సుధా రఘునాథన్

పల్లవి :
నిదరే కల అయినది
కలయే నిజమైనది
బతుకే జత అయినది
జతయే అతనన్నది
మనసేమో ఆగదు
క్షణమైనా తోచదు
మొదలాయే కథే ఇలా...॥
చరణం : 1
వయసంతా వసంతగాలి
మనసనుకో మమతనుకో
ఎదురైనది ఎడారి దారి
చిగురులతో చిలుకలతో
యమునకొకే సంగమమే
కడలి నది కలవదులే
హృదయుమిలా అంకితమై
నిలిచినది తన కొరకే
పడిన ముడి పడుచు ఒడి ఎదలో
చిరుమువ్వల సవ్వడి॥
చరణం : 2
అభిమానం అనేది మౌనం
పెదవులపై పలకదులే
అనురాగం అనే సరాగం
స్వరములకే దొరకదులే
నిను కలిసిన ఈ క్షణమే చిగురించే
మధు మురళి
నిను తగిలిన ఈ తనువే
పులకరించే ఎద రగిలి
ఎదుటపడి కుదుటపడే
మమకారపు నివాళిలే ఇది॥