Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

idhedho Bagundey - ఇదేదో బాగుందేత


చిత్రం : మిర్చి(mirchi) (2013)

రచన : రామజోగయ్యశాస్త్రి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, గానం : విజయ్ ప్రకాష్, అనిత


కాటుక కళ్లను చూస్తే
పోతుందే మతి పోతుందే
చాటుగ నడుమును చూస్తే
పోతుందే మతి పోతుందే
ఘాటుగ పెదవులు చూస్తే
పోతుందే మతి పోతుందే
లాటుగ సొగసులు చూస్తే
పోతుందే మతి పోతుందే
లేటుగ ఇంతందాన్ని చూశానే అనిపిస్తుందే
నా మనసే నీవైపొస్తుందే
ఇదేదో బాగుందే చెలీ ఇదేనా ప్రేమంటే మరి
ఇదేదో బాగుందే చెలీ ఇదేనా ప్రేమంటే మరి
నీ మతి పోగొడుతుంటే నాకెంతో సరదాగుందే
ఆశలు రేపెడుతుంటే నాకెంతో సరదాగుందే
నిన్నిల్లా అల్లాడిస్తే నాకెంతో సరదాగుందే
అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుందే
నీ కష్టం చూస్తూ అందం అయ్యయ్యో
అనుకుంటూనే
ఇలాగే ఇంకాస్సేపంటోంది
ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి
ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి
చరణం : 1
తెలుసుకుంటావా తెలుపమంటావా
మనసు అంచుల్లో నించున్న నా కలని
ఎదురు చూస్తున్నా ఎదుటనే ఉన్నా
బదులు దొరికేట్టు పలికించు నీ స్వరాన్ని
వేల గొంతుల్లోన మోగిందే మౌనం
నువ్వున్న చోటే నేనని
చూసీ చూడంగానే చెప్పింది ప్రాణం
నేన్నీదాన్నైపోయానని
ఇదేదో బాగుందే చెలీ ఇదేనా ప్రేమంటే మరి
ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి
చరణం : 2
తరచి చూస్తూనే తరగదంటున్నా
తళుకు వర్ణాల నీ మేను పూల గని
నలిగిపోతూనే వెలిగిపోతున్నా
తనివితీరేట్టు సంధించు చూపులన్నీ
కంటి రెప్పలు రెండూ పెదవుల్లా మారి
నిన్నే తినేస్తామన్నాయే
నేడో రేపో అది తప్పదుగా మరి
నీకోసం ఏదైనా సరే
ఇదేదో బాగుందే చెలీ ఇదేనా ప్రేమంటే మరి
ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి

AraDuguloNTADA - ఆరడుగులుంటాడా

చిత్రం : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (Seethamma VakiTlo Sirimalle CheTTu) (2013)
రచన : అనంత శ్రీరామ్
సంగీతం : మిక్కీ జె. మేయర్, గానం : కళ్యాణి

పల్లవి :
ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా
ఏమడిగినా ఇచ్చేవాడా
ఆశపెడుతుంటాడా ఆటపడుతుంటాడా
అందరికి నచ్చేసేవాడా
సరిగ్గా సరిగ్గా సరిగ్గా నిలవవెందుకే
బెరుగ్గా బెరుగ్గా అయిపోకే
బదులేదీ ఇవ్వకుండా వెళ్లిపోతే ॥
చరణం : 1
మాటల ఇటుకలతో గుండెల్లో కోటలు కట్టేడా
కబురుల చినుకులతో
పొడి కలలన్నీ తడిపేయడా
ఊసుల ఉరుకులతో ఊహలకే ఊపిరి ఊదేడా
పలుకుల అలికిడితో ఆశలకే ఆయువు పోయడా
మౌనమై వాడు ఉంటే ప్రాణమేమవ్వునో
నువ్వే నా ప్రపంచం అనేస్తూ వెన క తిరుగుతూ
నువ్వే నా సమస్తం అంటాడే
కలలోన కూడా కానుకందనీడే ॥
చరణం : 2
అడిగిన సమయంలో
తను అలవోకగా నను మోయాలి
సొగసుని పొగడడమే తనకలవాటైపోవాలి
పనులను పంచుకునే
మనసుంటే ఇంకేం కావాలి
అలకని తెలుసుకుని అందంగా బతిమాలాలి
కోరికేదైనా గాని తీర్చి తీరాలనీ
అతణ్నే అతణ్నే అతణ్నే చూడటానికి
వయస్సే తపిస్తూ ఉంటుందే
అపుడింక వాడు నన్ను చేరుతాడే


Watch Full Songs:
Meghaallo | Full Song With Lyrics | Seethamma Vakitlo Sirimalle Chettu Movie
Vaana Chinukulu Full Song Seethamma Vakitlo Sirimalle Chettu Movie
Yemcheddam Full Song | Seethamma Vakitlo Sirimalle Chettu Movie
Sitamma Vakitlo Full Song | Seethamma Vakitlo Sirimalle Chettu Movie
Meghaallo Full Song | Seethamma Vakitlo Sirimalle Chettu Movie

kathalO rAjakumAri - కథలో రాజకుమారి

చిత్రం : కళ్యాణ రాముడు(kaLyANa rAmuDu) (2003)
రచన : సాయి శ్రీహర్ష, సంగీతం : మణిశర్మ
గానం : కె.జె.ఏసుదాస్

10 January - నేడు కె.జె.ఏసుదాస్ బర్త్‌డే(K.J. Jesudas Birthday)
పల్లవి :
కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా
ఇలలో రాజకుమారుడు రాజసవీరుడు నిలిచేరా
హృదయములోని మనసును రేపి
బ్రతుకులలోని తీపిని చూపి
కోవెలమ్మ మెట్టు ప్రేమ
ఒట్టు గట్టు చూపెట్టి తీరేట్టు ॥
చరణం : 1
ఆలయమందున్నది ఆరిపోనట్టి ప్రేమేరా
ఆకాశము నేల ఒకటయ్యి వచ్చేసి
ఆశీస్సు అందేనురా
ప్రేమొక పిచ్చిదిరా ప్రాణమిచ్చేంత మంచిదిరా
చెయ్యెత్తి మొక్కంగ జేగంట కొట్టంగ
ఆ ప్రేమ పండేనురా
కోరుకున్న కోరికలు సాగిపోవు దీపాలు
చేరువగును చేరికలు తీరిపోయి శాపాలు
శుభకరములు తన కరములు
వరమాలే ఇచ్చేరా ॥
చరణం : 2
శ్రావణ ముహూర్తాలలో ప్రేమ ప్రమిదెలు వెలిగేరా
తాళాలు రేగంగ మేళాలు మోగంగ
మాంగల్యధారణరా
బంగరు మేఘాలురా రంగు పందిళ్లు వేసేయరా
కళ్లకు దిద్దంగా ఆ నీలిమేఘం కాటుక అయ్యేరా
తారబొట్టు పెట్టేనూ తాళిబొట్టు అల్లేనూ
నింగి వేదికేసేనూ చూడ వేడుకయ్యేనూ
వెయ్యొత్తుల దీపాలతో ఇక పెళ్లే జరిగేరా॥