Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

vAna chinukulu - వాన చినుకులు

చిత్రం : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(SVSC)
(seetamma vakiTlO sirimalle cheTTu) (2013)
రచన : అనంత శ్రీరామ్
సంగీతం : మిక్కీ జె. మేయర్
గానం : అంజనా సౌమ్య, కార్తీక్

పల్లవి :
వాన చినుకులు ఇట్టా తడిపితే
ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే
ఎట్టాగ లొంగుతుంది సొగసే
ఆగవమ్మో అమ్మో ఎంత దురుసే
అరె అబ్బాయంటే అంత అలుసే
నీకు కళ్ల్లాలు వేసిక అల్లాడించాలని
వచ్చా వచ్చా వచ్చా అన్నీ తెలిసే ॥
చరణం : 1
నీ వలన తడిశా నీ వలన చలిలో చిందేశా
ఎందుకని తెలుసా నువ్వు చనువిస్తావని ఆశ
జారు పవిటని గొడుగుగ చేశానోయ్
అరె ఊపిరితో చలి కాశానోయ్
హే... ఇంతకన్న ఇవ్వదగ్గదెంతదైన
ఇప్పుడుంటే
తప్పకుండా ఇచ్చి తీరుతాను చెబితే॥
చరణం : 2
సిగ్గులతో మెరిశా
గుండె ఉరుములతో నిను పిలిచా
ముద్దులుగ కురిశా ఒళ్లు హరివిల్లుగా వంచేశా
నీకు తొలకరి పులకలు మొదలైతే
నా మనసుకి చిగురులు తొడిగాయే
నువ్వు కుండపోతలాగ వస్తే బిందెలాగ ఉన్న
ఊహ పట్టుకున్న హాయికింక లేదు కొలతే॥

panNDagalA digi _ పండగలా దిగి

చిత్రం : మిర్చి(mirchi) (2013)
రచన : రామజోగయ్యశాస్త్రి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, గానం : కైలాష్ ఖేర్

పల్లవి :
పండగలా దిగి వ చ్చావు
ప్రాణాలకు వెలుగిచ్చావు
రక్తాన్నే ఎరుపెక్కించావు
మా తోడుకు తోడయ్యావు
మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అండై నిలిచావు॥
అయ్యంటే ఆనందం
అయ్యంటే సంతోషం
మా అయ్యకు అయ్యన్నీ నువ్వు
కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం
ఇట్టాగే పదికాలాలు ఉండనివ్వు
చరణం :1
జోలాలి అనలేదే చిననాడు
నిన్నెపుడు ఈ ఊరి ఉయ్యాల
నీ పాదం ముద్దాడి
పులకించిపోయిందే ఈ నేల ఇయ్యాల
మా పల్లె బతుకుల్లో మా తిండి
మెతుకుల్లో మీ ప్రేమేనిండాల
మా పిల్లపాపల్లో మా ఇంటి దీపాల్లో
మీ నవ్వే చూడాలా
గుండె కలిగిన గుణము కలిగిన
అయ్య కొడుకువుగా
వేరు మూలము వెతికి మా జత చేరినావు ఇలా॥
చరణం : 2
పెదవుల్లో వెన్నెల్లు గుండెల్లో కన్నీళ్లు
ఇన్నాళ్లూ ఇన్నేళ్లూ
అచ్చంగా నీవల్లే మా సామి కళ్లల్లో
చూసామీతిరనాళ్లు
ఏ దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో
మురిసాయి ముంగిళ్లు
మా పుణ్యం పండేలా ఈ పైన మేమంతా
నీవాళ్లూ అయినోళ్లూ
అడుగు మోపిన నిన్నుచూసి అదిరె పలనాడు
ఇక కలుగు దాటి బైటపడగా బెదరడా పగవాడు॥

nEnIdarini nuvvAdarinI - నేనీదరిని నువ్వాదరినీ

చిత్రం : బంగారుబొమ్మలు(bangAru bommalu) (1977)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

పల్లవి :
నేనీదరిని నువ్వాదరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ
మనమంటే తనకెంతో ముద్దని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ॥
చరణం : 1
కసాయి గుండెల లోకంలో
కలిమిలేముల సమరంలో॥
మన పడవలు కలిసి నడవలేవని
మరుజన్మ ఒడ్డుకు మరలించమని
కలిపింది ఇద్దరినీ
చరణం : 2
నీ ఎదలో తుది ఆశను నేనై
నా ఒడిలో తుది ఊపిరి నీైవె ॥ఎదలో॥
వలచిన బ్రతుకులు కలిసేవేళ
మరణమే మనకు మాంగల్యమని
కలిపింది ఇద్దరినీ
చరణం : 3
దేవునికన్నా వేదంకన్నా
దివికన్నా భువికన్నా ముందుగ॥
ప్రకృతిని ప్రేమే నడిపెనని
అది ప్రళయంలోనూ
బ్రతికుంటుందని
కలిపింది ఇద్దరినీ
మనమంటే తనకెంతో ముద్దని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ॥