Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

nAlO nEnEnA - నాలో నేనేనా


గీత స్మరణం
 పల్లవి :
 అతడు: నాలో నేనేనా... ఏదో అన్నానా...
 నాతో నే లేని మైమరపున
 ఏమో అన్నానేమో...
   నువ్వూ విన్నావేమో...
 విన్నమాటేదో నిన్నడగనా॥నేనేనా॥
 అలా సాగిపోతున్నా నాలోన
 ఇదేంటిలా కొత్త ఆలోచన
 మనసే నాది మాటే నీది ఇదేం మాయో...  ॥నేనేనా॥
 చరణం : 1
 అ: ఔనూ కాదూ తడబాటుని
 అంతో ఇంతో గడిదాటనీ
 విడివడిపోనీ పరదాని... పలుకై రానీ ప్రాణాన్ని
 ఆమె: ఎదంతా పదాల్లోన పలికేనా
 నా మౌనమే ప్రేమ ఆలాపన
 మనసే నాది మాటే నీది
   ఇదేం మాయో...॥నేనేనా॥
 చరణం : 2
 ఆ: దైవం వరమై దొరికిందనీ
 నాలో సగమై కలిసిందనీ
 మెలకువ కానీ హృదయాన్ని
   చిగురైపోనీ శిశిరాన్ని
 అ: నీతో చెలిమి చేస్తున్న నిమిషాలు
 నూరేళ్లుగా ఎదిగిపోయాయిలా
 మనమే సాక్ష్యం మాటే మంత్రం
    ప్రేమే బంధం॥నేనేనా॥

Movie:bANam
Singers:Hemachandra,Saindhavi
Lyrics:Ramajogayya Sastry
Music:Mani sharma
Director:Chaitanya Dantuluri
Cast:Nara Rohith,Vedika


Naalo Nenena Yedho Annana
Nathonee Leni Maimarapuna
Yemo Annananemo Nuvvu Vinnavemo
Vinna Maatedho Ninnadagana

Naalo Nenena Yedho Annana
Nathonee Leni Maimarapuna
Yemo Annananemo Nuvvu Vinnavemo
Vinna Maatedho Ninnadagana
Alaa Saagipothunna Naalona
Idi Enti Ela Kottha Alochanaa
Manase Naadi Maate Needi
Idhem Maayoo

Naalo Nenena Yedho Annana
Nathonee Leni Maimarapuna
Yemo Annananemo Nuvvu Vinnavemo
Chinna Maatedho Ninnadagana

Avunu Kadhu Thadubaatunii
Antho Intho Gadidhatanii
Vidi Vidi Poni Paradhaanii
Palukai Raani Pranaanii
Yadanta Padaalloni Palikena
Naa Mouname Prema Aalaapana
Manase Naadi Maate Needi
Idem Maayo

Naalo Nenena Yedho Annana
Nathonee Leni Maimarapuna
Yemo Annananemo Nuvvu Vinnavemo
Chinna Maatedho Ninnadagana

Daivam Varamayi Dorikindanii
Naalo Sagamai Kalisindhanii
Melukuva Kaani Hrudayanii
Chiguraiponi Sisiraanii
Neetho Chelimi Chestunna Nimishalu
Noorelluga Yedhigi Poyayi Ila
Maname Saaksham Maatee Mantram
Premee Bandham

Naalo Nenena Yedho Annana
Nathonee Leni Maimarapuna
Yemo Annananemo Nuvvu Vinnavemo
Chinna Maatedho Ninnadagana 

pUjaku vELAyerA - పూజకు వేళాయెరా

చిత్రం : భక్త తుకారాం (bhakta tukArAm) (1973)

రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : పి.ఆదినారాయణరావు
గానం : ఘంటసాల, పి.సుశీల

గీత స్మరణం
 పల్లవి :
 ఆమె: పూజకు వేళాయెరా...
 రంగపూజకు వేళాయెరా... ఆ...
 పూజకు వేళాయెరా...
 ఇన్నినాళ్లు నేనెటుల వేచితినో
 ఎన్ని రేలు ఎంతెంత వేగితినో॥
 పిలుపును విని విచ్చేసితివని
 నా పిలుపును విని విచ్చేసితివని
 వలపులన్నీ నీ కొరకె దాచితిని     (2)
 ఎవరూ పొందని ఏకాంతసేవలో
 ఈవేళ తమిదీరగా నిన్నె అలరించు॥
 చరణం :
 ఆ: ఈ నీలినీలి ముంగురులు... ఇంద్రనీలాల మంజరులు
 ఈ వికసిత సిత నయనాలు... శతదళ కోమల కమలాలు
 అరుణారుణమీ అధరము... తరుణమందార పల్లవము
 ఎదలో పొంగిన ఈ రమణీయ పయోధరాలు
 పాలకడలిలో ఉదయించు సుధాకలశాలు...
 ఎంత సుందర ము శిల్ప బంధురము
 ఈ... జఘన మండలము
 సృష్టినంతటిని దాచుకున్న ఆ పృథివీ మండలము
 అతడు: ఓ... అభినవ సౌందర్యరాశీ
 ఓ... అపూర్వ చాతుర్యమూర్తీ
 నీ కటాక్షముల లాలనమ్ములో...
 నీ మధురాధర చుంబనమ్ములో...
 ॥కటాక్షముల॥
 మధురిమలెన్నో పొదుగుకున్న
 నీ స్తన్య సుధల ఆస్వాదనమ్ములో
 అప్రమేయ దివ్యానందాలను అందించే నీ చల్లని ఒడిలో
 హాయిగా నిదురించ గలిగే
   పాపగా నీ కడుపున జన్మించు భాగ్యమే
   లేదాయె తల్లీ తల్లీ తల్లీ...
 ఆ: స్వామీ అ: అవునమ్మా నీవు ప్రదర్శించిన
   సౌందర్యం అనిత్యం
 నీవు నమ్ముకున్న యవ్వనం అశాశ్వతం
 దువ్వుకున్న ఆ నీలిముంగురులె దూదిపింజలై పోవునులే
 నవ్వుతున్న ఆ కంటి వెలుగులే దివ్వెల పోలిక ఆరునులే
 వన్నెలొలుకు ఆ చిగురు పెదవులే వాడి వక్కలై పోవునులే
 పాలుపొంగు ఆ కలశాలే తోలుతిత్తులై పోవునులే
 నడుము వంగగా నీ ఒడలు కుంగగా
 నడుము వంగగా ఒడలు కుంగగా
 నడువలేని నీ బడుగు జీవితం... వడవడ వణకునులే
 ఆశలు రేపే సుందర దేహము అస్థిపంజరంబౌనులే

Bhakta Tukaram Songs - Poojaku Velayara Song - Nageswara Rao, Sivaji Ganesan, Sridevi - Youtube Video

padaNDi munduku - పదండి ముందుకు

చిత్రం : పదండి ముందుకు (padaNDi munduku) (1962)

 రచన : శ్రీశ్రీ
 సంగీతం : ఎస్.పి.కోదండపాణి
 గానం : ఘంటసాల, మాధవపెద్ది సత్యం, ఎ.పి.కోమల


గీత స్మరణం
పల్లవి : 
 అతడు: పదండి ముందుకు...
  పదండి తోసుకు
 కదం తొక్కుతూ కదలండి
 స్వరాజ్యమే మన జన్మహక్కనీ
 సమస్త జగతికి చాటండి    ॥
 భారతవీర ప్రజలారా
 స్వరాజ్య వాదీ ధరించు ఖాదీ     (2)
 పరాయి సరుకులు మనకేలా ॥
 ఆమె: రాటమున వడకే వారే
 పోరాటములోన వడకరులే॥॥
 చరణం : 1
 అ: అహింసయే మన ఆయుధమూ
 సత్యాగ్రహమే సాధనమూ॥
 ఆ: త్రివర్ణ సుందర పతాకము
 భారత దాస్య విమోచనము॥
 అ: ప్రేమా శాంతీ ధర్మం నిండిన     (2)
 రామ రాజ్యమే ఆశయమూ     (2)॥
 చరణం : 2
 ఆ: కల్లు మానండోయ్ బాబయ్యా
 కళ్లు తెరచి సాగి రారయ్యా బాబయ్యా
 ॥మానండోయ్‌॥
 కాపురాలను కూల్చురాకాసిరా
 కన్నీళ్లు కష్టాలు కొనితెచ్చురా॥
 మంచితనమే చంపి...
   మమతలే తెగతెంపి
 మనల పశువుల చేయు మహామారిరా
 ॥మానండోయ్‌॥॥
 చరణం : 3
 అ: తరతరాల దురన్యాయాలకు
   గురియై... బలియై...
 దారి కనరాని వారీ దరిద్రనారాయణులూ
   హరిజనులు
 సాటి మనిషిని దూరం చేసే జనులు
   మోక్షం కనలేరసలు     (2)
 సమాజమంతా సమానమైతే
 నాడే జాతికి నవజీవనము     (2) ॥
 చరణం : 4
 ఈ భూమి మా భూమిరా
 ఇది బంగారు మాగాణిరా
 పనులెన్నో వేసి పంట సిరులను దోచి
 మాతల్లి నేలకే మమ్ము దూరమ్ము చేయు
 దుష్టపరిపాలనకు స్వస్తియీనాడే
 పన్నుల నిరాకరణ ప్రారంభమాయె...॥
 తెలుగు దేశ వీరులారా...
 భరత దేశ పౌరులారా...
External Link:
padaNDi munduku