Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

gOpAla bAlakrishNa - గోపాలబాలకృష్ణ

చిత్రం : పాండురంగడు (pANDu rangaDu)(2008)

 రచన : శ్రీ వేదవ్యాస
 సంగీతం : ఎం.ఎం.కీరవాణి
 గానం : మధుబాలకృష్ణన్, సునీత, కీరవాణి, బృందం
గీత స్మరణం
 సాకీ : అతడు: గోపాలబాలకృష్ణ గోకులాష్టమి
 ఆబాలగోపాల పుణ్యాల పున్నమి
 ముకుంద పదముల ముగ్గుల ఇల్లే బృందావని
 నంద నందనుడు నడచిన చోటే... న వనందనవని
 బృందం: గోపికా ప్రియ కృష్ణహరే
 నమో కోమల హృదయ కృష్ణహరే
 వేవేల రూపాల వేదహరే నమో వే దాంతవేద్యా కృష్ణహరే(2)
 పల్లవి :
 ఆమె: గోవిందుడే కోకచుట్టి గోపెమ్మ వేషం కట్టి
 ముంగోల చేతబట్టి వచ్చెనమ్మా॥
 నవమోహన జీవన వరమిచ్చెనమ్మా
 ఇకపై ఇంకెపుడూ నీ చేయి విడిచి వెళ్లనని
 చేతిలోన చెయ్యేసి ఒట్టేసెనమ్మా
 బృం: దేవకీ వసుదేవ పుత్రహరే
 నమో పద్మపత్ర నేత్ర కృష్ణహరే
 యదుకుల నందన కృష్ణహరే
 నమో యశోద నందన కృష్ణహరే॥
 చరణం : 1
 ఆ: ఎన్నాళ్లకు... ఎన్నాళ్లకు...
 ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు
   వెన్నుడొచ్చెనమ్మా
 ఎన్నెన్నో చుక్కల్లో నన్ను మెచ్చెనమ్మా
 వెన్నపాలు ఆరగించి... విన్నపాలు మన్నించి (2)
 వెండి వెన్నెల్లో ముద్దులిచ్చెనమ్మా
 ఇద్దరు: కష్టాల కడలి పసిడి పడవాయెనమ్మా
 కళ్యాణ రాగమురళి కలలు చిలికెనమ్మా
 ఆ: మా కాపురాన మంచి మలుపు తిప్పెనమ్మా
 అ: వసుధైక కుటుంబమని గీత చెప్పెనమ్మా
 బృం: గోవర్ధనోద్ధార కృష్ణహరే
 నమో గోపాల భూపాల కృష్ణహరే
 గోవింద గోవింద కృష్ణహరే
 నమో గోపికావల్లభ కృష్ణహరే॥॥
 చరణం : 2
 ఆ: తప్పటడుగు తాండవాలు చేసినాడమ్మా
 తన అడుగుల ముగ్గులు చూసి మురిసినాడమ్మా
 అ: మన అడుగున అడుగేసి... మనతోనే చిందేసి (2)
 మన తప్పటడుగులు సరిదిద్దినాడమ్మా
 కంసారి సంసారిని కలిసి మెరిసెనమ్మా
 కలకాల భాగ్యాలు కలిసొచ్చెనమ్మా
 హరిపాదం లేనిచోటు మరుభూమేనమ్మా
 ఆ: శ్రీపాదం ఉన్నచోట సిరులు విరియునమ్మా
 బృం: ఆపదోద్ధారక కృష్ణహరే
 నమో ఆనందవర్ధక కృష్ణహరే
 లీలామానుష కృష్ణహరే
 నమో గానవిలాస కృష్ణహరే॥॥

sirulichchu lEvammA - సిరులిచ్చు లేవమ్మా

చిత్రం : బొమ్మలు చెప్పిన కథ (bommalu cheppina katha) (1969)

రచన : కొసరాజు, సంగీతం : మాస్టర్ వేణు
 గానం : పి.సుశీల, బృందం

గీత స్మరణం
పల్లవి :
 ఆమె: సిరులిచ్చు లేవమ్మా శ్రీలక్ష్మిదేవి
 పసుపు కుంకుమలిచ్చునమ్మా పార్వతీదేవి
 బృందం:     ॥
 చరణం : 1
 ఆ: జాతిరత్నము గర్భమందున
   జననమందాలి
 బృం: జననమందాలి...
 ఆ: ఆ... జననమందాలి...
 ఆ: సామ్రాజ్యముల పాలించి తండ్రికి ఖ్యాతి తేవాలి
 బృం: ప్రఖ్యాతి తేవాలి
 ఆ: ఆ... ధీరుడై రణశూరుడై సుకుమారుడై
   ప్రజలెల్ల మెచ్చగ
 అతనికతడే సాటియన జయముందుకోవాలి
 బృందం: ॥
 చరణం : 2
ఆ: ముంచేతి గాజులు ఎపుడు గలగల
   మ్రోగుచుండాలి
 బృం: గలగల మ్రోగుచుండాలి
 ఆ: తల్లోని పూవులు ఘుమఘుమలు
    వెదజల్లుచుండాలి
 బృం: వెదజల్లుచుండాలి
 ఆ: పుట్టినింటికి మెట్టినింటికి
   వన్నె తెచ్చిన సాధ్వివై
  కలకాలమును ముత్తైవుగా
   నీ బ్రతుకు గడపాలీ
  బృందం:     ॥


Oh my love - ఓ మై లవ్

చిత్రం : ప్రేమకథా చిత్రమ్ (prEmakathA chitram) (2013)

రచన : కాసర్ల శ్యామ్
సంగీతం : జె.బి.
గానం : లిప్సిక

గీత స్మరణం
పల్లవి :
 ఓ మై లవ్... ఓ మై లవ్...
   మై లవ్ మై లవ్...
 ఓ మై లవ్... ఏ చోట ఉన్నా
 నీడల్లే నీవెంట ఉన్నా
 నన్నే నేను నీలో చూస్తు వున్నా
 ఓ మై హార్ట్ ఏం చేస్తు వున్నా
 ఏదోలా నీ తోడు కానా...
 నువ్వే లేని నేనే నేను కానా
 నాలోనూ దాగున్న నీ ప్రేమ... నీదాక చేరేది ఎలా
 మై లవ్ ఓ... మై లవ్ ఓ... ఓ మై లవ్...
 చరణం : 1
 కలిసేలా విషయముకై ఎదురే చూస్తుందే
 ఎదురైతే ఎందుకనో సిగ్గే వేస్తుందే
 నీవల్లే కలవరమంతా మదినే తడిపేస్తుందే
 చిత్రంగా ఉంది నాకే ఏదేదో చేస్తుంటే
 నీవేగా నీవేగా నీవేగా...
 నా చుట్టూ నీవేగా ఇలా...
 మై లవ్ ఓ... మై లవ్ ఓ...
   ఓ మై లవ్...
 చరణం : 2
 నువ్వే నా సొంతమని ధీమా వస్తుందే
 చొరవగనే వస్తున్నా చేరువ నీవుంటే
 నీవున్నావన్న ధ్యాసే
   నన్నే నడిపిస్తుందే
 అందంగా ఉంది నాకే నువ్వే నేనౌతుంటే
 నీవేగా నీవేగా నీవేగా...
 నేనంటూ నీవేగా ప్రియా...
 మై లవ్ ఓ... మై లవ్ ఓ... ఓ మై లవ్...