Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

danDAlayya - దండాలయ్య

చిత్రం:కూలీ నెం.1 Coolie No1 (1991)

 రచన     : సిరివెన్నెల
 సంగీతం     : ఇళయరాజా
 గానం     : ఎస్.పి.బాలు, బృందం

గీత స్మరణం
సాకీ:  
జై జై జై జై... గణేష జై జై జై జై...
జైజై జై జై... వినాయక జై జై జై జై...
పల్లవి:
దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ
నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ
పిండి వంటలారగించీ తొండమెత్తి దీవించయ్యా
తండ్రివలె ఆదరించి తోడు నీడ అందించయ్యా... ఓ...
దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ
నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ
చరణం : 1
చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర   
పాపం కొండంత నీ పెనుభారం
ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా
హోహోహో జన్మ ధన్యం
చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర
పాపం కొండంత నీ పెనుభారం
ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు
తిప్పిందిరా హోహోహో జన్మ ధన్యం
 అంబారిగ ఉండగల  ఇంతటి వరం
      అయ్యారా అయ్యా
 అంబాసుతా ఎందరికి లభించురా
     అయ్యారా అయ్యా
 ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా
 దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా
     దయుంచయ్యా దేవ
 నీ అండాదండా ఉండాలయ్యా
     చూపించయ్యా త్రోవ
 చరణం: 2
 శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం
     నిన్నే చేసింది వేళా కోళం
 ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా
     ఏవైపోయింది గర్వం
 శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం
     నిన్నే చేసింది వేళా కోళం
 ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా
     ఏవైపోయింది గర్వం
 త్రిమూర్తులే నిను గని తలొంచరా అయ్యారా అయ్యా
 నిరంతరం మహిమను కీర్తించరా అయ్యారా అయ్యా
 నువ్వెంతనే అహం నువ్వే దండించరా
 దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ
 నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ
 అరెరెరెరెరే... పిండి వంటలారగించీ
     తొండమెత్తి దీవించయ్యా
 తండ్రివలె ఆదరించి తోడు నీడ
     అందించయ్యా... ఓ....
 దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా
     దయుంచయ్యా దేవ
 నీ అండాదండా ఉండాలయ్యా
     చూపించయ్యా త్రోవ

sannajAji tIvalOy - సన్నజాజి తీవలోయ్

గీత స్మరణం
 పల్లవి :

 సన్నజాజి తీవలోయ్...
 సంపంగి పూవులోయ్...
 చిలిపి సింగారులోయ్...
 పాపలు సిరులొలికే చిన్నారులోయ్...
 ॥

 చరణం : 1

 కన్నుల విందులోయ్
 వెన్నెల చిందులోయ్
 పచ్చని బ్రతుకులో పన్నీటి జల్లులోయ్
 బాలల సందడే పరువూ వేడుకా
 ఇలు వాసికి మరో పేరు ఈ చిన్నారులే
 ॥

 చరణం : 2

 లోగిలి బలిమే బాలల నవ్వులూ
 ఇల్లాలి కలిమే పిల్లల కిలకిలా
 ఊరికి పండుగే ఇంటను ఊయలా
 సిరిసంపద మరో పేరు ఈ చిన్నారులే
 ॥

 చరణం : 3

 దాగుడుమూతలాడితే సూరీడు మెచ్చేను
 చెమ్మచెక్కలాడితే చందమామ మెచ్చేను
 చెమ్మ చెక్క చారెడేసి మొగ్గ
 ఇల్లుదీసి పందిరేసి పకపకలాడితే
 పిల్లలున్న లోగిలిని దేవుడే మెచ్చేను
 ॥

 చిత్రం : అనురాగం(anurAgam) (1963)
 రచన : మల్లాది రామకృష్ణశాస్త్రి
 సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
 గానం : భానుమతి

చిత్రం : ఔను.. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు(Avunu Valliddaru Ista Paddaru)(2002)

 రచన : సాయి శ్రీహర్ష
సంగీతం : చక్రి


గీత స్మరణం

Emi eebhAgyamO - ఏమి ఈ భాగ్యమో

ఏమి ఈ భాగ్యమో నేస్తమా...
స ప ద ప సనిసా...
ఏమి ఈ భాగ్యమో నేస్తమా
నేనే నిండగా ఆ ఎండే పండగా
ఈ వేసవే కోమలం శీతలం
ఆ చల్లని చంద్రుని మండలం
ఈ మందిరం సుందరం అందలం
ఆ అంబరం సంబరం సంగమం
ఏమి ఈ భాగ్యమో నేస్తమా...
 గానం : కౌసల్య
 ------------------------

ennennO varNAlu - ఎన్నెన్నో వర్ణాలు

 ఆమె: ఎన్నెన్నో వర్ణాలు... అన్నింట్లో అందాలు
ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు
ఒక టైతే మిగిలేది తెలుపేనండీ
నలుపేమో నాకిష్టం మీ మనసు మీ ఇష్టం
నాకోసం మీ ఇష్టం వదలొద్దండీ
మీ మది తొందర చేసే బాటను వీడక
మీరు సాగిపోండిక
ఇదే ఇదే నా మాటగా పదే పదే నా పాటగా
ఎన్నెన్నో వర్ణాలు...
 అతడు: నేనంటూ ప్రత్యేకం నాదంటూ ఓ లోకం
పడలేను ఏ జోక్యం అంతేనండీ
బాగుంది మీ టేస్టూ నాకెంతో నచ్చేట్టు
మనసెంతో మెచ్చేట్టు మీ మీదొట్టు అందుకే నే దిగివచ్చా వంచని నా
తలవంచా స్నేహ భావమా
అందుకె నే దిగివచ్చా
వంచని నా తలవంచా
స్నేహ భావమా కలా
నిజం నీకోసమే అనుక్షణం ఉల్లాసమే॥
గానం : ఎస్.పి.బాలు, కౌసల్య
 ఆమె: పొగడమాకు అతిగా చేసెయ్యమాకు
పొగడపూల లతగా
రాసినావు చాలా ఆ రాతలంత నేను ఎదిగిపోలా
నువ్వనే వచ్చింది నా నోట చనువుగ
పిలుపులో తడబాటు ఆ మాట పలుకగ
తెలుసుకుంటే పొరబాటు
అతడు: నువ్వు అంటూ పిలుపు
నాకెంతో నువ్వు దగ్గరైన తలపు
పరిచయాల మలుపు దాచేసుకున్న మాటలన్నీ తెలుపు
చిగురులే వేసేను ఈ కొమ్మ హొయలుగ
పూవులై పూసేను ఈ జాబు చదవగ
ఊహలేవో ఉదయించే॥
 గానం : ఎస్.పి.బాలు, కౌసల్య
 ------------------------