Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

rose(4) roja puvvA - రోజ్(4) రోజా పువ్వా

చిత్రం : అల్లరి ప్రియుడు - Allari priyuDu (1993)

  రచన : వేటూరి, సంగీతం : ఎం.ఎం.కీరవాణి
 గానం : ఎస్.పి.బాలు, చిత్ర, బృందం

గీత స్మరణం
పల్లవి :
 అతడు: ఆహాహాహా... హా... హా...  ఆహ హాహా హా...
 ఆమె: అ హహహహ హా హ  హా హహా...
 అ: అహ హా హా... హ హా... హా... ఆ...
 అ: రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా
 రోజాపువ్వా... పువ్వా పువ్వా...
 రోజు రోజు రోజు రోజు పూస్తువున్న
పువ్వే నువ్వా నవ్వే నువ్వా
ఆ: రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా
ముద్దు పెట్టకుండ ఘల్లుమన్న మువ్వే నున్నా
అ: పడుచుతనపు గడుసువలపు
 పాటవు నువ్వా... వావ్వా...
 ॥రోజ్‌॥
 బృందం: గులాబి ఘుం... ఘుం ఘుం... (2)
 చరణం : 1

 అ: చక్కదనానికి చక్కిలిగింతవు నువ్వా నువ్వా
 కందే పువ్వా... కన్నె పువ్వా...
 వెన్నెల వాకిట ఎర్రగ పండిన దివ్వే నువ్వా
 చిందే రవ్వా... పొద్దే నువ్వా...
 ఆ: గుండె చాటు ప్రేమలెన్నొ కోటు మీద
   చాటుతున్న రోజాపువ్వా
 అందమైన ఆడపిల్ల బుగ్గపండు గిల్లుతున్న సిగ్గే నువ్వా
 అ: చిగురు ఎరుపు తెలుపు పొగడమాలిక నువ్వా... ఆ...
 ॥రోజ్‌॥
 చరణం : 2
 ఆ: ప్రేమ సువాసన పెదవుల వంతెన వేసే నువ్వే
   పూసే పువ్వా... బాసే నువ్వా
 కౌగిలి చాటున కాముడు మీటిన వీణే నువ్వా
   జాణే నువ్వా జాజే నువ్వా
 అ: గుప్పుమన్న ఆశలెన్నొ కొప్పులోన
   దాచుకున్న రోజా పువ్వా
 సందెపొద్దు సంతకాల ప్రేమలేఖ పంపుకున్న
   గువ్వే నువ్వా
 ఆ: మధుర కవిత చదివి పెదవి పండిన పువ్వా... ఆ...
 ॥రోజ్‌॥

adi oka idilE - అది ఒక ఇదిలే


చిత్రం : ప్రేమించిచూడు (prEminchi chUDu) (1965)

 రచన : ఆచార్య ఆత్రేయ
 సంగీతం : మాస్టర్ వేణు
 గానం : పి.బి.శ్రీనివాస్, పి.సుశీల

 


గీత స్మరణం
 పల్లవి :
 ఆమె: అది ఒక ఇదిలే అతనికే తగులే
 సరికొత్త సరసాలు సరదాలు చవిచూపెలే
 ఆహ ఎనలేని సుఖమెల్ల తనతోటిదనిపించెలే
 లాలలాలలాలలాలలలా    ॥
 అది ఒక ఇదిలే...
 చరణం : 1
 అతడు: మెచ్చాను వచ్చాను ఏమేమో తెచ్చాను
 అహ నచ్చాను అన్నావా ఏమైనా ఇస్తాను
 అని పలికిందిరా... చె లి కులికుందిరా...
 ఎద రగిలిందిరా మతి చెదిరిందిరా చెదిరిందిరా...
 అది ఒక ఇదిలే ఆమెకె తగులే
 సరికొత్త సరసాలు సరదాలు చవిచూపెలే
 ఆహ ఎనలేని సుఖమెల్ల తనతోటిదనిపించెలే
 అది ఒక ఇదిలే...
 చరణం : 2

 ఆ: సిగ్గేల అన్నాడు నా బుగ్గ గిల్లాడు     (2)
 అహ మొగ్గల్లే ఉన్నావు విరబూయమన్నాడు
 మది పులకించెను...  మరులొలికించెను...
 నను మరిపించెను తగుననిపించెను అనిపించెను...
 అది ఒక ఇదిలే...
 చరణం : 3
 అ: నడకేది అన్నాను నడిచింది ఒకసారి
 అహ నడుమేది అన్నాను నవ్వింది వయ్యారి
 నా వద్దున్నదే... తన ముద్దన్నదీ...
 చేకొమ్మన్నదీ నీ సొమ్మన్నది... సొమ్మన్నది
 ఆ: ఎండల్లే వచ్చాడు
   మంచల్లే కరిగాను
 ఆహా వెన్నెల్లు కురిశాడు
   వేడెక్కిపోయాను
 ఇది బాధందునా
   ఇది హాయందునా
 ఏది ఏమైననూ నే తనదాననూ
   తనదాననూ...॥

ammA ani kottagA - అమ్మా అని కొత్తగా

 

చిత్రం : లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (Life Is Beautiful) (2012)


AmmA Ani Kothaga Youtube Video Song - Life Is Beautiful Movie


 రచన : వనమాలి
 సంగీతం : మిక్కీజె. మేయర్
 గానం : శశికిరణ్, శ్రావణభార్గవి
గీత స్మరణం
పల్లవి :
 ఆమె: అమ్మా అని కొత్తగా...
   మళ్లీ పిలవాలనీ...
 తుళ్లే పసిప్రాయమే మళ్లీ మొదలవ్వనీ
 అతడు: నింగి నేల
   నిలిచే దాకా తోడుగా
 వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
 నువు కావాలే అమ్మా...
 నను వీడొద్దే అమ్మా...
 బంగారం నువ్వమ్మా...
 అమ్మా అని కొత్తగా...
   మళ్లీ పిలవాలననీ...
 తుళ్లే పసిప్రాయమే మళ్లీ మొదలవ్వనీ
 చరణం : 1
 అ: నిదురలోని కల చూసి
   తుళ్లి పడిన ఎదకి
 ఏ క్షణం ఎదురౌతావో జోలపాటవై
 ఆ కలని అడగక ముందే నోటి ముద్ద నువ్వై
 ఏ కథలు వినిపిస్తావో జాబిలమ్మవై
 నింగి నేల నిలిచే దాకా తోడుగా
 వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
 నువు కావాలే అమ్మా...

 నను వీడొద్దే అమ్మా..
 బంగారం నువ్వమ్మా...
 చరణం : 1
 అ: చిన్ని చిన్ని తగవులే
   మాకు లోకమైన వేళ
 నీ వెతలు మనసెపుడైన
   పోల్చుకున్నదా
 రెప్పలా కాచిన నీకు
  కంటి నలుసులాగ
 వేదనలు పంచిన మాకు
 వేకువున్నదా
 నింగి నేల నిలిచే దాకా తోడుగా
 వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
 నువు కావాలే అమ్మా...
 నను వీడొద్దే అమ్మా...
 బంగారం నువ్వమ్మా...

Amma Ani Kothaga Full Song with Lyrics - Life is Beautiful Movie