Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

kOTappa koNDaku - కోటప్పకొండకు

చిత్రం: ప్రేమాభిషేకం - prEmAbhikshEkam (1981)

  రచన: దాసరి నారాయణరావు
 సంగీతం: చక్రవర్తి, గానం: ఎస్.పి.బాలు, పి.సుశీల

గీత స్మరణం
నేడు అక్కినేని పుట్టినరోజు - AkkinEni Birthday

 పల్లవి :
 అతడు: కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా     (2)
 ఆరుబయట ఎండలో సరుగుతోట నీడలో
 కన్నెపిల్ల కనిపిస్తే కన్ను కన్ను కలిపేస్తే
 నూటొక్క టెంకాయ కొడతానని
 ఆమె: కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా     (2)
 ఆరుబయట ఎండలో సరుగుతోట నీడలో
 బుజ్జిబాబు కనిపిస్తే నా కోసం పడిచస్తే
 నూటొక్క టెంకాయ కొడతానని॥
 చరణం : 1
 అ: హలో... ఆ: హలో...     (2)
 అ: హలో హలో అనమంటుంది కుర్రమనసు
 ఆ: చలో చలో పొమ్మంటుంది బుల్లిమనసు
 అ: పొమ్మని పైపైకి అంటుంది
 రమ్మని లోలోన ఉంటుంది    ॥
 ఆ: పొమ్మని రమ్మంటే అది స్వర్గం
 రమ్మని పొమ్మంటే అది నరకం
 ఆ స్వర్గంలోనే తేలిపోవాలి
 ఈ స్వప్నంలోనే నలిగిపోవాలి
 ఔనంటే నువ్వు ఊ... అంటే     (2)
 నూటొక్క టెంకాయ కొడతానని॥
 చరణం : 2
 అ: గొంతు గొంతు కలిపి పాడితే యుగళ గీతం
 ఆ: పెదవి పెదవి కలిపి పాడితే ప్రణయగీతం
 కళ్లు కలుసుకుంటే ప్రేమపాఠము
 కళ్లు కుట్టుకుంటే గుణపాఠము
 ఆ: కళ్లు కళ్లు కలిపి చూడు ఒక్కసారి
 ఒళ్లు ఝల్లుమంటుంది తొలిసారి
 అ: ఆ జల్లుల్లోనే తడిసిపోవాలి
 ఆ తడి కౌగిల్లో అలిసిపోవాలి॥॥

Kotappa Kondaku Song - Premabhishekam Movie - Youtube Video Songs - ANR - Jayasudha - Sridevi

Emani aDaganU - ఏమని అడగనూ

చిత్రం : పాండురంగడు - pAnDu rangaDu (2008)

  రచన : శ్రీవేదవ్యాస
 సంగీతం : ఎం.ఎం.కీరవాణి
 గానం : ఎస్.పి.బాలు, మాళవిక, సౌమ్య

గీత స్మరణం
పల్లవి :
 అతడు: ఏమని అడగనూ...
   ఏ వరము నిను కోరనూ
 నీ దాసదాసానుదాసుడనూ
 నీ ఎదుట నే మూగనూ...
 కృష్ణా... ఆ...
 ఏమని అడగనూ...
 చరణం : 1
 అ: మొసలి బారిపడి
 మొరలిడినా గజేంద్రుని బాధలు లేవు
 రక్ష రక్షయని ప్రార్థించుటకు ద్రౌపది దుస్థితి లేదు
 అటుకులిచ్చు సంపదలు తెమ్మనే అర్ధాంగలక్ష్మి లేనే లేదు
 అడగకున్నా అన్నీ ఇచ్చేవాడే... నా వాడని తెలిసీ...
 ఏమని అడగనూ... ఏ వరము నిను కోరనూ
 కృష్ణా... కృష్ణా... కృష్ణా... ఆ... ఏమని అడగనూ...
 చరణం : 2
 ఆమె: బంధమే లేని భగవంతుడు
   నీ అనుబంధానికి బంధితుడు
 అందరిచేత అడిగించుకొనేవాడు నిన్నడుగుతున్నాడు
 అంతా నువ్వే అంటాడయ్యా... ఆ ఒక్కటేదో అడగవా...
 అ: (వచనం)- అమ్మా... ఈ కిష్టయ్య
 చిన్నప్పుడు మన్ను తిన్నాడని తెలిసి నోరు చూపమంటే
 తన నోట పదునాలుగు
   భువనాలను చూపించాడు కదమ్మా
 అప్పుడు ఆ యశోదమ్మ ఆశ్చర్యంతో
   నోరు తెరిచి చూసేందే కానీ
 నోరు తెరిచి ఏమైనా
   అడిగిందా తల్లీ...
 అ: మన్ను తిన్న ఆ నోట
 అన్ని లోకాలను చూసిన యశోదమ్మ ఏ వరమడిగిందమ్మా...
 వేణుగానమును విని ఆ గోవులు తరించినవి కానీ...
   గోవిందుని ఏం కోరాయమ్మా
 ముక్తికాంతుడగు ముకుందుడే...
 ముక్తికాంతుడగు ముకుందుడే
   నా ముందు నిలిచి ఉన్నాడు
 నా పంచప్రాణాల తులసి దళాలతో అర్చన చేస్తున్నాను
 ఇంతకన్నా కావలిసింది ఇంకేముందీ
 అంతా తెలిసిన అంతర్యామిని అడిగేదేముందీ...

Pandurangadu Movie - Youtube Video Songs - Emani Adaganu Song

I hate love stories - ఐ హేట్ లవ్ స్టోరీస్

చిత్రం : గ్రీకువీరుడు - Greeku VeeruDu (2013)

  రచన : కృష్ణచైతన్య
 సంగీతం : ఎస్.ఎస్.థమన్
 గానం : నవీన్ మాధవ్, రంజిత్

Greeku Veerudu Movie Full Songs - I Hate Love Stories Youtube Video Song - Nagarjuna, Nayantara, SS Thaman


గీత స్మరణం
 ఐ హేట్ లవ్ స్టోరీస్... అందానికి నే దీవానా
 వీకెండ్ ప్రేమంటే... ముందుంటానే హసీనా
 ఐ హేట్ లవ్ స్టోరీస్... పెయిన్ ఈజ్ ఈక్వల్ టు ప్రేమ
 Oh rum and rise and shine...
 Wanna won and women and wine
 Dabadeee dabadeee dabadeee bo
 Everyday is mine oh mine
 Life is just too short
 Go give it all you got no matter where you touch me
 I am hot right at the spot
 డాలర్‌నే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నా
 కలలన్నీ నే కొంటున్నా ఆశలపై విసిరేస్తున్నా
 ॥Oh rum॥
 సంతోషం ఒళ్లో తేలేదే ఈ జమానా
 ప్రేయసి ప్రేమైనా రేపటికేలే పురానా
 లీగల్ ప్రేమంటే షాదీ అని నేనంటున్నా
 ॥Oh rum॥
 ఆనందం అంచుల పైన తేలడమే లైఫంటున్నా
 వేగంలో కాలం కన్నా ముందే ఉండాలంటున్నా
 ॥Oh rum॥

Greeku Veerudu | I Hate Love stories Full Song With Lyrics - YouTube