Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

most wanted - మోస్టు వాంటెడు

  చిత్రం : భాయ్ - bhAi (2013)

  రచన : రామజోగయ్యశాస్త్రి
  సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
  గానం : నరేంద్ర, మమతా మోహన్‌దాస్


గీత స్మరణం
 సాకీ:
 ఆమె: ఆలిండియాకే మంటపెట్టే ఐటం నేనురా
 నాయాంటెన్నాకే అంటుకోని సిగ్నల్లేదురా
 రయ్య ర య్య రయ్యా రయ్యా రయ్య రయ్య రయ్యా
 రయ్య ర య్య రయ్యా రయ్యా రయ్యా రయ్యా
 ॥ర య్య॥
 పల్లవి :
 ఆ: మోస్టు వాంటెడు అందగత్తె నేను కంచు కత్తి నేను
 నా కంటిచూపుతో సునామీ పుట్టిస్తాను
 ॥ర య్య॥

 మోస్టు వాంటెడు ఫేసుబుక్కు నేను మాసు లుక్కు నేను
 నా పైట చెంగులో దునియానే చుట్టేస్తాను
 ॥ర య్య॥

 స్వీటు స్వీటుగున్న హాటు కేకు నేను
 చీమల్ని కోరే బెల్లం ముక్క నేను
 కోట్ల ఫ్యాన్సుకే డ్రీమ్ గర్ల్‌నయ్యాను
 తాడులేని ఆడ బొంగరం నేను
 మీసకట్టు చూసి నీకు పడ్డాను
 యాడికైన నన్ను ఎత్తుకెళ్లమంటాను
 ॥ర య్య॥

 అతడు: మోస్టు వాంటెడూ
   ఈ అందగాడు నీకు అందనోడు
 నీనైసు గోకుడూ ఇష్టంలే వాట్ టూ డూ
 నీ కోక జారుడు ఎక్కినాది రోడ్డు అది వెరీ బ్యాడ్డూ
 నా ఫొటోఫ్రెములో నీ బొమ్మకు చోటేలేదు
 ॥ర య్య॥
 చరణం : 1
 ఆ: హే... మిడ్డీనా మెరిసే శారీనా
 ఏది నీకు ఇష్టమైన డ్రెస్సు
   అది కట్టుకొచ్చి ఇచ్చుకుంట కిస్సూ
 హే... ఇండోరా అదిరే ఔట్ డోరా
 ఏది నీకు ఇష్టమైన ప్లేసు చలో ఆడికెళ్లి చేసుకో రొమాన్సు
 అ: గ్లామరే మన బ్యాంకు బాలెన్సు
   ఇవ్వలేనె పోరి నీకు బ్లాంకు చెక్సూ
 టైము లాసు టాక్సుమాని
   పిండ్రాపు సెలైన్సుగుంటే బెస్టు
 ॥ర య్య॥॥వాంటెడు॥

 చరణం : 2

 ఆ: నే ఫుల్ మూను నువ్వే సన్‌షైను
 ఎంత బాగా మ్యాచయ్యిందో పెయిరు
   నాతో పెట్టుకోర ముద్దుగా ఎఫైరు
 నే ఐఫోను నువ్వే రింగుటోను
 ట్రింగు ట్రింగు మంది లవ్వు సీను
   ఎప్పుడెప్పుడెప్పుడంది హనీమూను
 అ: చాకొలెట్టు ఏజు చంటగాణ్ణి కాను
   ఐసుపెట్టి నాకు ఎయ్యమాకె లైను
 నాకు నేను సోలో మేను మీ ట్రిక్సు వర్కౌటు కానివ్వను
 ॥ర య్య॥॥వాంటెడు॥

Bhai Telugu Movie || Most Wanted Full Song With Lyrics || Nagarjuna, Richa Gangopadyaya


pAripOkE piTTA - పారిపోకే పిట్టా

చిత్రం : నువ్వొస్తానంటే నేనొద్దంటానా - nuvvostAnaNTE nEnoddaNTAnA (2005)

రచన : సిరివెన్నెల (sirivennela)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ (dEviSrI prasAd)
గానం : మల్లికార్జున్ (mallikArjun), సాగర్ (sAgar)


పల్లవి :
 పారిపోకే పిట్టా చేరనంటే ఎట్టా     (2)
 అంత మారం ఏంటంటా మాట వినకుండా
 సరదాగా అడిగాగా మజిలీ చేర్చావా తీసుకుపో నీ వెంటా
 వస్తా తీసుకుపో నీ వెంటా...
 చరణం : 1
 నా సంతోషాన్నంతా పంపించా తనవె ంటా
 భద్రంగానే ఉందా ఏ బెంగపడకుండా
 తన అందెలుగ తొడిగా నా చిందరవందర సరదా
 ఆడిస్తుందా లేదా సందడిగా రోజంతా
 చినబోయిందేమో చెలికొమ్మ
   ఆ గుండెల గూటికి ముందే కబురీయవే చిలకమ్మా
 నీవాడు వస్తాడే ప్రేమా
   అని త్వరగా వెళ్లి నువ్విన్న కథలన్నీ చెప్పమ్మా కాకమ్మా
 తీసుకుపో నీ వెంటా... వస్తా తీసుకుపో నీ వెంటా...
 హే... పుటుక్కు జరజర డుబుక్కుమే     (2)
 చరణం : 2
 ఆకలి కనిపించింది నిన్నెంతో నిందించింది
 అన్నం పెట్టను పోవే అని కసిరేశావంది
 నిద్దుర ఎదురయ్యింది తెగ చిరాగ్గా ఉన్నట్టుంది
 తన వద్దకు రావద్దంటూ తరిమేశావంటుంది
 ఏం గారం చేస్తావే ప్రేమా
 నువ్వడిగిందివ్వని వాళ్లంటూ ఎవరున్నారమ్మా
 ఆ సంగతి నీకు తెలుసమ్మా నీ పంతం ముందు
 ఏనాడు ఏ ఘనుడు నిలిచాడో చెప్పమ్మా
 తీసుకుపో నీ వెంటా... ఓ ప్రేమా తీసుకుపో నీ వెంటా... ॥

onTarELa tunTarODu - ఒంటరేళ తుంటరోడు

చిత్రం : రామయ్యా వస్తావయ్యా - rAmayyA vastAvayyA (2013)

 రచన : శ్రీమణి
 సంగీతం : ఎస్.ఎస్.థమన్
 గానం : శంకర్‌మహదేవన్, సుచిత్ర
గీత స్మరణం
 పల్లవి :
 ఆమె: ఒంటరేళ తుంటరోడు ఒంటిగుంటే ఒదిలిపోడు
 గండు చీమలాగ నన్ను కుట్టినాడు
 బుద్ధుడల్లె ఉన్నవాడు ముద్దులడుగుతుంటే చూడు
 బుగ్గ చుట్టు పిల్లి మొగ్గలేసినాడు
 అతడు: చందనాల చెక్కలాంటి చక్కనైన పిల్లా
 చాందినీల చుక్క సిగ్గు చెక్కి పోతే ఎల్లా
 చెంపకేసి అద్దు ముద్దు పావడాల బిళ్ల
 చేతులోంచి జారిపోకే ఓసి సబ్బు బిళ్ల
 నేతి అరిసెలా పూల బరిసెలా
 సానబెట్టి సూది కళ్లు గుండెలోన గుచ్చమాకలా
 కుర్ర ఈడు గుర్రమెక్కి ముక్కుతాడు చేతబట్టి
 గుంజుతుంటే గింజుకోవ ఆశలన్ని
 పాతికేళ్ల మీసకట్టు ఒక్క చూపుతోటే ఫట్టు
 చేసుకోవే జిల్లుమన్న దిల్లు బోణి
 చరణం : 1
 ఆ: పావుగంట కౌగిలిస్తే తీయగా
 అ: పావుసేరు తేనెకైనా అంత తీపి లేదుగా
 ఆ: ఎక్కడో తళుక్కు మంది పిల్లగా
 అ: పాలరాయి పావురాయి నువ్విలా నవ్వగా
 ఆ: లేడికళ్ల చిన్నదాన్ని వాటి చూపులేసి
   ప్రేమతోటి కొట్టినావుగా
 గాజు బొమ్మలాంటి దాన్ని జారిపోనివ్వకుండా
   ప్రాణమేసి పట్టినావుగా
 అ: సిగ్గు పడకలా నెగ్గినావే పిల్లా
 చిలిపి చిలకలా కలికి కులుకులా
 జారుతున్న దోర గుండె కోరికోరి కోరకమాకలా॥ఈడు॥
 చరణం : 2
 ఆ: ఇక్ డోలు డోలు డోలునా
 అ: పరికిణీలో చందమామ పరిణయం కోరేనా
 ఆ: ఇక్ డోలు డోలు డోలునా
 అ: చుక్కలాంటి చక్కనమ్మ బుగ్గ చుక్క అడిగేనా
 ఆ: పొయ్యి మీద పాలకుండ పొంగి పొర్లి పోయే
   పండగేదో ముందరుందనా
 పక్కమీద సన్నజాజి పూలే జల్లే
   సంగతేదో సణుగుతోందనా
 అ: సొగసు సంకెలా విసరకే పిల్లా
 కొసరు నడుముతో ఎసరు ముసరగా
 తస్సదియ్య కస్సుమన్న కన్నెతోడు కన్ను కొట్టగా ॥ఈడు॥
Watch / Listen Full Songs:
Ramayya Vasthavayya Movie Full Songs Jukebox - Jr.NTR,Samantha, Shruthi Hasan