Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

endukO nIvu nAtO - ఎందుకో నీవు నాతో

చిత్రం : కృష్ణవేణి - KrushnavENi (1974)

 రచన : దాశరథి
సంగీతం : విజయభాస్కర్
 గానం : వి.రామకృష్ణ, పి.సుశీల
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
 పల్లవి :
 అతడు: ఎందుకో నీవు నాతో ఉన్నవేళ
   ఇంత హాయి
 ఆమె: ఎందుకో నిన్ను విడిచి నిమిషమైన
   నిలువలేనోయి
 అ: ఎందుకో నీవు నాతో ఉన్నవేళ
   ఇంత హాయి
 ఆ: ఎందుకో నిన్ను విడిచి నిమిషమైన
   నిలువలేనోయి
 చరణం : 1
 అ: మనసులోని మమతలన్నీ
   మల్లెపూలై విరిసె నీకై     (2)
 ఆ: వలపులన్నీ పూలమాలై
   కురులలోన కొలిచె నీకై
 అ: ఎన్ని జన్మలకైనా... నీవు నాదానివేనే
 ఇద్దరు: ఇందుకు సాక్ష్యము గిరులు తరులు
   గిరులు తరులు... ॥
 చరణం : 2
 ఆ: నీలికన్నుల ఆలయాన
   నిన్ను స్వామిగ నిలుపుకోనా     (2)
 అ: ఎల్లవేళలా జీవితాన
    నిన్ను దేవిగా కొలుచుకోనా
 ఆ: గౌరీశంకరుల చందం
   మనది విడిపోని బంధం
 ఇద్దరు: ఇందుకు సాక్ష్యము సూర్యుడు చంద్రుడు
   సూర్యుడు చంద్రుడు... ॥

rAve nA cheliyA - రావె నా చెలియా

చిత్రం : జీన్స్  - Jeans (1998)

 రచన : ఎ.ఎం.రత్నం - A. M. ratnam, శివగణేష్ - SivagaNEsh
 సంగీతం : ఎ.ఆర్.రెహమాన్ - A. R. Rehman
 గానం : సోను నిగమ్ - sOnu nigam, హరిణి - hariNi
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి : 
అతడు: రావె నా చెలియా రావె నా చెలియా
   రయ్యంటు రావె చెలి
 వారెవ్వా చెలియా వయసైన చెలియా
   ఊరంతా గోల చెయ్యి
 ఆమె: మమతకు నువ్వు ప్రతిబింబం
   తల్లికన్నా గారాబం
 చిననాటి అనురాగం వయసైతే అనుబంధం
 అ: ఏ అవ్వా నా గువ్వా
   నువ్వింకా అందం దోచెయ్యి ॥॥
 చరణం : 1
 అ: జీన్స్ పాంటు వేసుకో లిప్ స్టిక్కు పూసుకో
 నిజమైన తలనెరుపే
   డై వేసి మార్చుకో...ఓ... యే...
 ఆ: ఓలమ్మో ఏమి చోద్యం
   నా వయసే సగమాయే
 అ: క్లింటన్ నంబరు చేసిస్తాను గలగలమంటూ
   ఐ లవ్ యూ నువ్ చెప్పెయ్యి
 ఆ: నువ్వెవరంటే మిస్ వరల్డ్ కాదు
   మిస్ ఓల్డని చెప్పేయి ॥
 చరణం : 2
 ఆ: ఓ... కంప్యూటర్ పాటలకు
   పులివేషం నువ్వాడు
 అ: ఎంటీవీ ఛానెల్లో శక్తి స్తోత్రం నువ్ పాడు
 టూ పీసు డ్రస్ వేసి సన్ బాతూ చెయ్యి బామ్మా
 డిస్నీలాండులో కళ్లాపి జల్లి బియ్యపు పిండితో
   ముగ్గులు వేద్దాం రాబామ్మా
 రోడ్డు మధ్యలో కొట్టేపెట్టి
   గారెలు వేసి అమ్ముదామా ॥

chUddAm Akasam - చూద్దాం ఆకసం

చిత్రం : విక్రమ సింహ - vikrama simha (2014)

 రచన : చంద్రబోస్ - chandrabose
 సంగీతం : ఎ.ఆర్.రెహమాన్ - A. R. rehman
 గానం : ఎస్.పి.బాలు, బృందం - SP bAlu and troope

గీత స్మరణం
 పల్లవి
 చూద్దాం ఆకసం అంతం...      (2)
 వేద్దాం అక్కడే పాదం ॥
 మళ్లీ పుట్టి మహినే గెలిచి
 ఎల్లలు దాటిన యోధా
 గాలుల గీతాలే ఎన్నడూ ఆగవులే
 గెలుపను దప్పిక ఎప్పుడూ తీరదులే తీరదులే
 హే... కత్తికొనతో ఒక సూర్యుణ్ణే సృష్టించు
 హే... మాతృదేశంలో సంతోషం పండించు
చరణం : 1
 ఆకాశం అడ్డొస్తే ఎగిరే పక్షైపోదాం
 మహాశిఖరమే అడ్డొస్తే దాటి మేఘాలౌదాం
 అరణ్యమొస్తే గాలైపోదాం
 సముద్రమొస్తే చేపైపోదాం
 వీరా... నీ గుండె వజ్రం వజ్రం వజ్రం
 వెంటేపడుతుంది విజయం విజయం విజయం
 లక్ష్యం ఎన్నటికీ దీక్షకి బంధువురా
 విజయం ఎప్పటికీ చెమటకి చుట్టమురా ॥

చరణం : 2
 మనసు ధనస్సు మాట బాణం
 ఎప్పుడైనా తప్పబోదు
 కొదమసింహమా గెలిచి పోరాడు పోరాడు...
 వీరా... నీ గుండె వజ్రం వజ్రం వజ్రం
 వెంటేపడుతుంది విజయం విజయం విజయం
 అందరి దీవెనతో ఆయువు పొందానే
 మీకే నా బ్రతుకే అంకితమిస్తానే
 హే... కత్తికొనతో ఒక సూర్యుణ్ణే సృష్టించు
 హే... మాతృదేశంలో సంతోషం పండించు ॥