Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

Oh nILavENi nIlavENI - ఓ నీలవేణి నీలవేణి

చిత్రం : ఏమో గుర్రం ఎగరావచ్చు - EmO gurram egarAvachchu (2014)

 రచన : చైతన్యప్రసాద్
 సంగీతం : ఎం.ఎం.కీరవాణి
 గానం : రాహుల్ సిప్లీగంజ్

ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి :
 ఓ నీలవేణి నీలవేణి రావె అలక మాని
 నీ హంస నడకలనీ ఫాలో ఔతున్నానని
 కోపంలోనూ ఇంతందమా...
 మనకి మనకి తేడాలెన్నో ఉన్నా
 కూడా కూడా రానా...
 నీడై నీడై పోనా ఇలా....
 తేడాలెన్నో ఉన్నా
 కూడా కూడా రానా...
 నీడై నీడై పోనా ఇలా....
 చరణం : 1
 ఎండపడి ఎర్రఎర్రగా కందినదే లేతబుగ్గ
 గొంతు తడి ఆరి ఎంతగా వాడినదొ మల్లెమొగ్గ
 నీకోసం నీలిమబ్బునై ఆకాశం చేరనా
 నేనే ఓ వానజల్లులై ఒళ్లంతా తడమనా
 కూడా కూడా రానా...
 నీడై నీడై పోనా...
 తేడాలెన్నో ఉన్నా... ఇలా హా... ఇలా... హా...
 చరణం : 2
 సోయగము విసిరి గుండెకే
   చేయకిక తీపి గాయం
 సోకులతో నన్ను చంపడం
   నీకు ఇది ఏమి న్యాయం
 నీ పంతం మొయ్యలేనిదని ఏనాడో తెలిసినా
 నువ్వేడు మల్లెలెత్తు అని ఇష్టంగా మోయనా
 కూడా కూడా రానా...
 నీడై నీడై పోనా...
 తేడాలెన్నో ఉన్నా... ఇలా హా... ఇలా... హా...

dEvatalArA raNDi - దేవతలారా రండి

చిత్రం : ఆహ్వానం - AhvAnam (1997)

 రచన : సిరివెన్నెల
 సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి
 గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి :
 ఆమె: దేవతలారా రండి మీ దీవెనలందించండీ
 నోచిన నోములు పండించే
   నా తోడును పంపించండీ
 కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి
   పతిరాడనిపించే వరుణ్ణే వరముగ ఇవ్వండీ
 కనివిని ఎరుగని వేడుకతో
   వివాహం జరిపించాలండీ
 కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి
   పతిరాడనిపించే వరుణ్ణే వరముగ ఇవ్వండీ
 కనివిని ఎరుగని వేడుకతో
   వివాహం జరిపించాలండీ
 చరణం : 1
 ఆ: ఓ... శివపార్వతులేమో
   ఈ దంపతులనిపించాలి
 ప్రతి సంసారంలోనూ మా కథలే వినిపించాలి
 అతడు: ఆ సిరిని శ్రీహరిని
   మా జతలో చూపించాలి
 శ్రీకాంతుల కొలువంటే మా కాపురమనిపించాలి
 ఆ: మా ముంగిలిలోన
   పున్నమి పూలవెన్నెల విరియాలి
 మా చక్కని జంట చుక్కలతోట పరిపాలించాలి ॥
 చరణం : 2
 అ: ఆ... తన ఎదపై రతనంలా
   నిను నిలిపే మొగుడొస్తాడు
 నీ వగలే నగలంటూ గారాలే కురిపిస్తాడు
 తన ఇంటికి కళతెచ్చే మహాలక్ష్మిగా పూజిస్తాడు
 తన కంటికి వెలుగిచ్చే మణిదీపం నీవంటాడు
 ఈ పుత్తడిబొమ్మ
   మెత్తని పాదం మోపిన ప్రతిచోట
 నిధినిక్షేపాలు నిద్దురలేచి ఎదురొచ్చేనంట ॥

bhUmiki pachchAni - భూమికి పచ్చాని

చిత్రం : శ్రీరాములయ్య - SrIrAmulayya (1998)

 రచన : కలెకూరి ప్రసాద్
 సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
 గానం : కె.జె.ఏసుదాస్, బృందం

పల్లవి :
 భూమికి పచ్చాని రంగేసిన ట్టో అమ్మలాలా
 పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా
 ఆలి పుస్తెలమ్ముకొని
   అప్పు తీర్చుకుంటివో అమ్మలాలా
 వలవలవల ఏడ్చుకుంటూ
   వలసెల్లిపోతివో అమ్మలాలా
 పురుగులమందే నీకు
   పెరుగన్నమాయనో అమ్మలాలా
 చెరవీడి భూతల్లి చెంతకు చేరిందిరో
 పంటలు చేతికొస్తే పండుగ చేద్దామురో ॥
 చరణం : 1
జాతరమ్మ జాతరమ్మ
   కూలిజనం జాతరో అమ్మలాలా
 ఎత్తుపల్లాలనే చదును చేసే జాతరో అమ్మలాలా
 చేలు దున్ని చాళ్లుదీసె
   బీదబిక్కి జాతరో అమ్మలాలా
 ఎద్దుకొమ్మల నడుమ ఎర్రపొద్దు పొడిచెరో
 భూస్వామి గుండెలధర గుడిసెలోల్ల జాతర ॥
 చరణం : 2
చెమట జల్లు చిలకరిస్తే
   నేల పులకించురో అమ్మలాలా
 వానొస్తే భూతల్లి శీమంతమాడురో అమ్మలాలా
 తంగెళ్లు గన్నేర్లు
   పసుపు కుంకుమిచ్చురో అమ్మలాలా
 పశుల మెడన చిరుగజ్జెలు ఘల్లున మ్రోగేనో
 గజ్జెల మోతల్లో పల్లె పరవశించెను ॥
 చరణం : 3
ఎగువ పెన్నమ్మమతల్లి
   ఎగిరెగిరి దుమికితే అమ్మలాలా
 తుంగభద్రమ్మ పొంగి
   పరవళ్లు తొక్కితే అమ్మలాలా
 చిత్రంగ చిత్రావతి చిందులు ఆడితే అమ్మలాలా
 నేలతల్లి నీళ్లాడి పసిడిపంటలిచ్చురో
 నా సీమకన్నుల్లో వెలుగులు నిండేనురో ॥