Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

nEnA pADanA pATa - నేనా... పాడనా పాట

చిత్రం : గుప్పెడుమనసు(guppeDu manasu) (1979)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్
గానం : ఎస్.పి.బాలు, వాణీజయరాం

30 November - వాణీజయరాం బర్త్‌డే(vANI jayarAm Birthday)


పల్లవి :
నేనా... పాడనా పాట
మీరా అన్నదీమాట ॥
నీ వదనం భూపాలము
నీ హృదయం ధ్రువతాళము
నీ సహనం సాహిత్యము
నువు పాడిందే సంగీతము॥
చరణం : 1
ఇల్లే సంగీతము
వంటిల్లే సాహిత్యము
ఈ పిల్లలే నా సాధనం
ఇంకా వింటారా నా గానం
నినిసస సససస దదనిని నినినిని
పపదద దదదద
మమపప పపపప
మపమప దప దనిద
నిసని దనిపా॥
ఊగే ఉయ్యాలకు
నువు పాడే జంపాలకు ॥
సరితూగదు ఏ గానము
నీకు ఎందుకు సందేహము (2)
చరణం : 2
ఉడకని అన్నానికీ
మీకొచ్చే కోపానికీ
ఏ రాగం బాగుండునో
చెప్పే త్యాగయ్య మీరేగా
నినిసస సససస దదనిని నినినిని
పపదద దదదద
మమపప పపపప
మప మప దప దనిద
నిసని దనిపా॥
కుతకుత వరి అన్నం
తైతకతకమను నాట్యం
ఏ భరతుడు రాసింది
నీకా పదునెటు తెలిసింది (2)॥

Guppedu Manasu - Full Length Telugu Movie - Sujatha - Sarath Babu - Saritha


kalagaNTi(2)కలగంటి కలగంటి/ VinnapAlu vinavale(విన్నపాలు వినవలె)

చిత్రం : అన్నమయ్య (1997)
రచన : అన్నమాచార్య
సంగీతం : ఎం.ఎం.కీరవాణి



పల్లవి : కలగంటి కలగంటి...
ఇప్పుడిటు కలగంటి
ఎల్లలోకములకు అప్పడగు
తిరువేంకటాద్రీశుగంటి॥
ఇప్పుడిటు కలగంటి...
చరణం : 1 అతిశయంబైన
శేషాద్రి శిఖరము గంటి
ప్రతిలేని గోపుర ప్రభలు గంటి
శతకోటి సూర్యతేజములు
వెలుగగ గంటి
చతరాస్యు పొడగంటి (2)
చయ్యన మేలుకొంటి
ఇప్పుడిటు కలగంటి...
చరణం : 2 అరుదైన
శంఖచక్రాదులిరుగడగంటి
సరిలేని అభయహస్తమును గంటి
తిరువేంకటాచలాధిపుని
చూడగగంటి
హరిగంటి గురుగంటి (2)
అంతట మేలుకొంటి॥
ఇప్పుడిటు కలగంటి... (2)
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం


విన్నపాలు వినవలె వింతవింతలు
విన్నపాలు వినవలె వింతవింతలు
పన్నగపు దోమతెర
పెకైత్తవేలయ్యా॥

కంటి శుక్రవారము
గడియా లేడింట
అంటి అలమేలుమంగ
అండనుండే స్వామిని ॥
పిడికిట తలంబ్రాల
పెండ్లికూతురు
కొంత పెడమరలి
నవ్వీనీ పెండ్లికూతురు॥

పేరుగల జవరాలి పెండ్లికూతురు
పెద్దపేరున ముత్యాల మెడ
పెండ్లికూతురు
పేరంటాండ్ల నడిమి
పెండ్లికూతురు (2)

విభు పేరు గుచ్చ సిగ్గువడి
పెండ్లికూతురు
అలర చంచలమైన ఆత్మనందుండ
నీ అలవాటు సేసెనీ ఉయ్యాల॥
పలుమారు ఉచ్ఛ్వాస
పవనమందుండ
నీ భావమ్ము తెలిపెనీ ఉయ్యాల॥
ఉయ్యాల... ఉయ్యాల... (4)

గానం : బాలు, రేణుక, శ్రీలేఖ

kAsIki pOyAnu rAmAhari - కాశీకి పోయాను రామా హరి

చిత్రం : అప్పుచేసి పప్పుకూడు(appuchEsi pappukUDu) (1959)
రచన : పింగళి నాగేంద్రరావు
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : ఘంటసాల, స్వర్ణలత

27 November - నేడు రేలంగి వర్ధంతి

అతడు : కాశీకి పోయాను రామా హరి
గంగ తీర్థమ్ము తెచ్చాను రామా హరి
గంగ తీర్థాము తెచ్చాను రామా హరి
ఆమె : కాశీకి పోలేదు రామా హరి
ఊరి కాల్వలో నీళ్లండి రామా హరి
మురుగుకాల్వలో నీళ్లండి రామా హరి
అతడు : శ్రీశైలం వెళ్లాను రామా హరి
శివుని వీభూతి తెచ్చాను రామా హరి
శివుని వీభూతి తెచ్చాను రామా హరి
ఆమె : శ్రీైశె లం పోలేదు రామా హరి
శివుని వీభూతి తేలేదు రామా హరి
ఇది కాష్ఠంలో బూడిద రామా హరి
అతడు : అన్నమక్కరలేదు రామా హరి
నేను గాలి భోంచేస్తాను రామా హరి
ఉత్త గాలి భోంచేస్తాను రామా హరి
ఆమె : గాలితో పాటుగా రామా హరి
వీరు గారెలే తింటారు రామా హరి
నేతి గారెలే తింటారు రామా హరి
అతడు : కైలాసమెళ్లాను రామా హరి
శివుని కళ్లార చూశాను రామా హరి
రెండు కళ్లార చూశాను రామా హరి
ఆమె : కైలాసమెళితేను రామా హరి
నంది తన్ని పంపించాడు రామా హరి
బాగా తన్ని పంపించాడు రామా హరి
అతడు : ఆలుబిడ్డలు లేరు రామా హరి
నేను ఆత్మయోగీనండి రామా హరి
గొప్ప ఆత్మయోగీనండి రామా హరి
ఆమె : ఆ మాట నిజమండి రామా హరి
నేను అందుకే వచ్చాను రామా హరి
నేను అందుకే వచ్చాను రామా హరి

Special Notes:
రేలంగి పూర్తి పేరు రేలంగి
వెంకట్రామయ్య. 1919 ఆగష్టు 9న రావులపాడులో జన్మించారు. 1935లో తీసిన ‘శ్రీకృష్ణ తులాభారం’ చిత్రంతో తెలుగు పరిశ్ర మకు పరిచయమయ్యారు. 1970లో కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ తో సత్కరించింది. ఈ పురస్కారం పొందిన తొలి హాస్యనటునిగా ఆయన చరిత్ర సృష్టించారు.