పల్లవి :
నీలమోహనా! రారా!
నిన్ను పిలిచె నెమలి నెరజాణ
జారువలపు జడివాన కురిసెరా!
జాజిలత మేను తడిసెరా
లతలాగే నా మనసు తడిసెరా!
చరణం : 1
ఏలాగె మతిమాలి? ఏడే నీ వనమాలి? ఏలాగె మతిమాలి? ఏడే నీ వనమాలి?
అతడేనేమో అనుకున్నానే
అంత దవుల శ్రావణ మేఘములగనీ
ప్రతిమబ్బు ప్రభువైతే
ప్రతికొమ్మ మురళైతే ఏలాగె
ఆ... ఏలాగె మతిమాలి
ఏడే నీ వనమాలి
చరణం : 2
ఆ... సారెకు దాగెదవేమి?
నీ రూపము దాచి దాచి
ఊరించుటకా స్వామీ?
సారెకు దాగెదవేమి..?
నీ కన్నుల తోడు నీ కలికి నవ్వుల తోడు
నీకోసం ఎంత వేగిపోయానో కృష్ణా
కృషా కృష్ణా కృష్ణా...
సారెకు దాగెదవేమి..?
చరణం : 3
అటు... అటు... ఇటు... ఇటు...
ఆ పొగడకొమ్మవైపు
ఈ మొగలి గుబురువైపు
కార్తీక రాతిరిలో కఱి మబ్బుంటుందా
నీలిమేఘమాకాశము విడిచి
నేల నడుస్తుందా
నడిచే మబ్బులకు నవ్వే పెదవుందా
నవ్వే పెదవులకు మువ్వల మురళుందా
పెదవి నందితే పేద వెదుళ్ళు
కదిలి పాడుతాయా?
నడిచే మబ్బులకు నవ్వే పెదవులు
నవ్వే పెదవులకు మువ్వల వేణువులు
మువ్వల వేణువులు...
(2)
చిత్రం : డాక్టర్ ఆనంద్ (1966)
రచన : దేవులపల్లి కృష్ణశాస్ర్తి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : పి.సుశీల, బృందం