పల్లవి :
ఓ చెకుముకే ఓ చెకుముకే
నువు చేరగ సరసకే
ఓ శశిముఖే ఓ శశిముఖే
ఇక మీసం మొలిచెను మనసుకే...
ఏ... ఏ... ఏహే...
మహం మహ మాయె...
మహం మాయలిక మొదలాయెనే
మహం మహ మాయె
ముహుర్తాలు ముదిరాయే
బహు తీయగ తీయగ తీయగ
తీయగ తెరలను తీయగ
ఓహో చల్లగ చల్లగ చల్లగ
చల్లగ విరులను చల్లగ
చెకుముకే
చరణం :
కాలికే మేఘాలు తగిలెనే
వే లికే గగనాలు వెలిగే
అంతరిక్షమంతరంగ మందువున్నది
పాలపుంత పూల సంత అయినది
ఊరించుతున్న స్వర్గమే
ఏరికోరుకుంటు వచ్చి ఇంటి పెరటిలో
మూల నక్కుతున్నది
దైవమే చేరి కుర్ర జంట వెర్రి ముంచి
ప్రేమ ప్రేమ మొక్కుతున్నది
అలాంటి హాయిదే అలాంటి హాయిదే
ఇలాంటి హాయి ఎక్కడున్నది
ఓ... ఓ... మళ్లీ పుట్టి మళ్లీ పెరిగి
మళ్లీ చూసి మళ్లీ కలసి మళ్లీ మెలసి
మళ్లీ మళ్లీ ప్రేమ కట్టి చచ్చి పుట్టి హో...
మళ్లీ నువ్వు మళ్లీ నేను
మళ్లీ బాధ మళ్లీ ప్రేమ
మళ్లీ కొత్త రంగులద్ద అలుపురాదులే
చెకుముకే
చిత్రం : పులి (2010)
రచన : చంద్రబోస్
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : జావేద్ అలీ, సుచిత్ర