Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

పల్లవి : నీలి మేఘ మాలవో నీలాల తారవో
నీ సోయగాలతో మదిని దోచిపోదువో ॥

చరణం : 1
నీ మోములోన జాబిలి
దోబూచులాడెనే
నీ కురులు తేలి గాలిలో
ఉయ్యాలలూగెనే
నిదురించు వలపు మేల్కొలిపి
దాగిపోదువో
నీలి మేఘ మాలవో...

చరణం : 2
నీ కెంపు పెదవి తీయని
కమనీయ కావ్యమే
నీ వలపు తనివి తీరని
మధురాల రావమే
నిలచేవదేల నా పిలుపు ఆలకించవో
నీలి మేఘ మాలవో...

చరణం : 3
రాదేల జాలి ఓ చెలీ ఈ మౌనమేలనే
రాగాల తేలిపోదమె జాగేల చాలునే
రావో యుగాల ప్రేయసి
నన్నాదరించవో
చిత్రం : మదన కామరాజు కథ (1962)
రచన : జి.కృష్ణమూర్తి
సంగీతం : రాజన్-నాగేంద్ర
గానం : పి.బి.శ్రీనివాస్

P.B.Sreenivas Birth Day on 27/02/11

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |