Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

vidhAta talapuna - విధాత తలపున

చిత్రం : సిరివెన్నెల (sirivennela)
గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం, సుశీల (SP bAlasubrahmanyam, sushIla)
రచన : సిరివెన్నెల (sirivennela)
సంగీతం: కె.వి.మహదేవన్ (K. V. MahadEvan)

పల్లవి:
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం..ఓం
ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదం ..ఓం
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
ఎద కనుమలలో.. ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం.....

సరస స్వర సుర ఝరి గమనమౌ సామవేద సారమిది ||2||
నే పాడిన జీవన గీతం ఈ గీతం...

విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం

చరణం 1:

ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన  ||2||

పలికిన కిల కిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా
విశ్వ కావ్యమునకిది భాష్యముగా ||విరించినై||

జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం ||2||

అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా
సాగిన సృష్టి విలాసములే ||విరించినై||

నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం ||2||
సరస స్వర సుర ఝరి గమనమౌ సామ వేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం...




Know the meaning of vidhAta talapuna song:

విధాత = బ్రహ్మ, సృష్టికర్త యొక్క
తలపున = ఊహలో
ప్రభవించినది = మెరిసినది
అనాది = మొదలు లేని
జీవన వేదం = ఈ సృష్టికి మూలమైన వేదం (సృష్టే వేదం, వేదమే సృష్టి)
ప్రాణ నాడులకు = మనలో ప్రాణానికి మూలమైన నాడుల్లో
స్పందన నొసగిన = ఆ ప్రాణాన్ని తట్టి లేపిన
ఆది ప్రణవ నాదం = తొలి ఓంకారము
కనుల కొలనులో = కళ్ళే కొలనులు అయితే
ప్రతిబింబించిన = ఆ కొలనులో ప్రతిబింబించిన
విశ్వరూప విన్యాసం = ఈ సృష్టి యొక్క రూప ఆవిష్కరణ
ఎద కనుమలలో = గుండె అనే పర్వత శ్రేణిలో
ప్రతిధ్వనించిన = మారుమ్రోగిన
విరించి = బ్రహ్మ యొక్క
విపంచి = వీణ
గానం = సంగీతం
సరస = రసముతో కూడిన( నవరసాల రసం )
స్వర = సంగీత స్వరం (స, రి గ)
సురఝరీ = దేవనది, గంగ
గమనమౌ = ప్రవాహము ఐనట్టి
సామవేద సారమిది = సామవేదం యొక్క సారాంశం ఇది
నే పాడిన జీవన గీతం ఈ గీతం = నే పాడిన ఈ పాట జీవిత గీతం

విరించినై = నేనే బ్రహ్మని
విరచించితిని = రచించితిని
ఈ కవనం = ఈ కవిత్వం
విపంచినై = వీణనై
వినిపించితిని = వినిపిస్తున్నా
ఈ గీతం - ఈ పాట
విరించినై...

ప్రాగ్దిశ వీణియ పైన = తూర్పు దిక్కు అనే వీణ మీద
దినకర మయూఖ తంత్రుల పైన = సూర్యకిరణాలనే తీగలు మీటుతూ
జాగృత విహంగ తతులే += నిద్రలేచిన పక్షి గుంపులు
వినీల గగనపు వేదిక పైన = నీలాకాశం అనే స్టేజి మీద
పలికిన కిలకిల స్వనముల = పలికిన కిల కిల ధ్వనులు
స్వరజతి = స్వరముల అమరిక, కృతి కీర్తన జావళి లాగా ఇది కూడా ఒక లాంటి పాట
జగతికి = ప్రపంచానికి , విశ్వానికి
శ్రీకారము కాగా = మొదలు కాగా
విశ్వకావ్యమునకి = విశ్వమనే కావ్యానికి
ఇది భాష్యముగా = వివరణగా

విరించినై...

జనించు = పుట్టిన
ప్రతి శిశు గళమున పలికిన = ప్రతి శిశువు గొంతున పలికిన
జీవన నాద తరంగం = జీవితమనే ధ్వనికెరటం, అల
చేతన = చైతన్యం, అచ్తివషన్
స్పందన = reverberation, రేసోనన్స్
ధ్వనించు = శబ్దం
హృదయ మృదంగ ధ్వానం - హృదయం మృదంగం వలె ధ్వనిస్తుంది.
అనాది = మొదలు లేని, చాలా పాతదైన, ఎప్పణ్ణించో ఉన్న
ఆది తాళం = ఆది తాళం
అనంత జీవన వాహినిగా = అంతం లేని జీవితమనే నదిలా
సాగిన సృష్టి విలాసమునే = సాగిపోయిన సృష్టి క్రీడ, ఆట, నాట్యం

విరించినై...

నా ఉచ్చ్వాసం = పీల్చే ఊపిరి, గాలి
కవనం = కవిత్వం
నా నిశ్వాసం = వదిలే ఊపిరి,గాలి
గానం = పాట

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |