అభినవ తారవో...నా...అభిమాన తారవో
అభినవ తారవో అభినయ రసమయ కాంతిధారవో
అభినయ రసమయ కాంతిధారవో
మంజుల మధుకర శింజాల సుమసరశింజినీ శివరంజని శివరంజనీ
అది దరహాసమా మరి మధురమాసమా
అది దరహాసమా మరి మధురమాసమా
ఆ మరునికి దొరికిన అవకాశమా
అవి చరణమ్ములా శశికిరణమ్ములా
నా తరుణభావన హరిణమ్ములా
అభినవ తారవో||
ఆ నయనాలు విరిసినచాలు అమవస నిశిలో చంద్రోదయాలు
ఆ నయనాలు విరిసినచాలు అమవస నిశిలో చంద్రోదయాలు
ఆ నెన్నడుము ఆడినచాలు
ఆ నెన్నడుము ఆడినచాలు రవళించును పదకవితా ప్రభందాలు
అభినవ తారవో||
నీ శ్రంగార లలిత భంగిమలో పొంగిపోదురే రుషులైన
నీ కరుణరసానిష్కరణంలో కరిగిపోదురే కర్కశులైన
వీరమా...నీ కుపిత నేత్ర సంచారమే
హాస్యమా నీకది చిటికెలోన వశ్యమే
నవరస పోషణ చణవనీ నటనాంకింత జీవనివనీ నిన్ను కొలిచి వున్నవాడ మిన్నులందుకున్నవాడ
ఆ
నే ఆరాధకుడను అస్వాదకుడను అనురక్తుడను..నీ ప్రియభక్తుడను
అభినవ తారవో||
చిత్రం : శివరంజని
గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం
రచన : డా.సి.నారాయణరెడ్డి
సంగీతం: రమేష్‌నాయుడు