Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : అడవిరాముడు
రచన : వేటూరి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల


పల్లవి :
కుకు కుకు కుకు కుకు...
కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి
చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి
డుడుం డుడుం డుడుం డుడుం...
వసంతుడే పెళ్లికొడుకు వనమంతా సందడి
పూలన్నీ తలంబ్రాలు పున్నమీ తొలిరేయి

చరణం : 1
తుళ్ళి తుళ్ళి నిన్నమొన్న తూనీగల్లే ఎగిరిన
పిల్లదాని కొచ్చిందీ కళ... పెళ్లికళ
తలపులన్ని వలపులైన చూపులు విరితూపులైన
పెళ్లికొడుకు నవ్వితే తళా... తళ తళా
పూలగాలితో రేగిన పుప్పొడి పారాణిగా
చిలకపాట నెమలి ఆట కలిసి మేజువాణిగా ॥
అందమైన పెళ్లికి అందరు పేరంటాలే
అడవిలోని వాగులన్ని ఆనందపు కెరటాలై ॥కుకు॥

చరణం : 2
కన్ను కన్ను కలుపుకున్న కన్నెమనసు
తెలుసుకున్న కనుల నీలినీడలే కదా ప్రేమకథ
బుగ్గలలో నిగ్గుదీసి సిగ్గులలో చిలకరించు
మొగ్గవలపు విచ్చితే కదా పెళ్లికథ
ఇరు మనసుల కొకతనువై
ఇరుతనవులకొక మనువై
మనసులోని వలపులన్ని మల్లెల విరిపానుపులై
॥మనసుల॥
కలిసివున్న నూరేళ్లు కలలుగన్న వేయ్యేళ్లు
మూడుముళ్లు పడిననాడు
ఎదలుపూల పొదరిళ్లు ॥కుకు॥

3rd April - నేడు జయప్రద బర్త్‌డే

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |