చిత్రం : మగధీర (2009)
రచన, సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : దీపు, గీతామాధురి
పల్లవి :
బబ్బబబ్బబ బాగుంది బబబబ్బ బాగుంది
బబ్బబబ్బ బాగుంది బాగుంది
నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది
నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది ॥
నాకోసం నువ్వు గోడ దూకేయడం బాగుంది
నే కనపడక గోళ్లు కొరికేయడం బాగుంది
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా
నచ్చ నచ్చ నచ్చావోయ్
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్ ॥పిచ్చి॥॥
చరణం : 1
కెబిఆర్ పార్కులో జాగింగుకు వెళ్లావంటూ
విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్
స్విస్ వీధుల మంచులో
మాట్లాడుతూ ఫ్రెంచ్‌లో
బర్గర్ తింటున్నావంటూ ఇంటిమేషన్
పాలకడలి అట్టడుగుల్లో
పూలపరుపు మెత్తటి దిళ్లో
పైన పడుకుండుంటావని కాలిక్యులేషన్
ఘన గోపుర భవంతిలో జనజీవన స్రవంతిలో
నా వెనకేవుంటూ దాగుడుమూతలు
ఆడడమనుకుంటా నీ ఇంటెన్షన్ ॥పిచ్చి॥
చరణం : 2
ఎవరో ఒక వనితామణిని
నువ్వేమోననుకుని పిలిచి
కాదని తెలిశాక వగచి సర్లే అని విడిచి
వెనకడుగేయొద్దుర కన్నా
వెనకే ఉందేమో మైనా
ఎదురెదురైపోతారేమో ఇహలో ఎపుడైనా
అనుకుంటూ కలగంటూ తనతోనే బ్రతుకంటూ
దొరకీ దొరకని దొరసాని
దరికొచ్చేదెపుడంటున్నా అంటున్నా అంటున్నా ॥పిచ్చి॥