Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : సీతామాలక్ష్మి (1978)
రచన : వేటూరి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : పి.సుశీల


పల్లవి :
అలలు కదిలినా పాటే ఆకు మెదిలినా పాటే
కలలు చెదిరినా పాటే కలతచెందినా పాటే
ఏ పాట నే పాడను బ్రతుకే పాటైన పసివాడను ఏ పాట నే పాడను బ్రతుకే పాటైన పసివాడను
ఏ పాట నే పాడను...

చరణం : 1
ఏలుకుంటే పాట మేలుకుంటే పాట
పాడుకుంటే పాట మా దేవుడు ॥
శ్రీమన్నభీష్ట వరదాఖిల లోకబంధో
శ్రీశ్రీనివాస జగదేక దయైక సింధో
శ్రీదేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం
ఆ సుప్రభాతాలు ఆ భక్తిగీతాలు
పాడకుంటే మేలుకోడు మమ్మేలుకోడు
ఏ పాట నే పాడను...

చరణం : 2
తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల
పాల కన్నా తీపి పాపాయికి ॥
రామలాలీ మేఘశ్యామ లాలీ
తామరసనయన దశరథ తనయ లాలీ ॥
ఆ... రామలాలికి ఆ ప్రేమగీతికి
రాముడైన పాప ఇల్లాలికి... ఈ లాలికీ ॥పాట॥

చరణం : 3
చేరువై హృదయాలు దూరమైతే పాట
జంట బాసిన గువ్వ ఒంటి బ్రతుకే పాట
ఎందుకో ఎందుకో...
నా మీద అలిగాడు చెలికాడు
ఎందుకో నా మీద అలిగాడు చెలికాడు
ఎదురు చూసిన చూపు చుక్కలైనా రాడు
నిదురకాచిన కంట కల అయిన కాలేడు ॥
గారాలు నీరాయే తీరాలు వేరాయే
మనసు మీరాలాయే వయసేటి పాలాయే ॥॥

22 May - నేడు వేటూరి వర్ధంతి

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |