Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : కులదైవం (1960)
రచన : కొసరాజు
సంగీతం : మాస్టర్ వేణు
గానం : ఘంటసాల, జమునారాణి

పల్లవి :
పదపదవే వయ్యారి గాలిపటమా (2)
పైన పక్షిలాగా ఎగిరిపోయి
పక్కచూపు చూసుకుంటూ
తిరిగెదవే గాలిపటమా
పదపదవే వయ్యారి గాలిపటమా

చరణం : 1
ప్రేమగోలలోన చిక్కిపోయినావా
నీ ప్రియుడున్న చోటుకై పోదువా
ఓ... ప్రేమగోలలోన చిక్కిపోయినావా
నీ ప్రియుడున్న చోటుకై పోదువా
నీ తళుకంతా నీ కులుకంతా
అది ఎందుకో తెలుసును అంతా ॥

చరణం : 2
నీకు ఎవరిచ్చారే బిరుదు తోక
కొని తెచ్చావేమో అంతేగాక
ఆ... నీకు ఎవరిచ్చారే బిరుదు తోక
కొని తెచ్చావేమో అంతేగాక
రాజులెందరూడినా మోజులె ంత మారినా
తెగిపోక నిల్చె నీ తోక ॥

చరణం : 3
నీలి మబ్బుల్లో ఆడుకుందువేమో
మింట చుక్కల్తో నవ్వుకుందువేమో ॥
వగలాడివిలే జగదంతవులే
దిగిరాకుండా ఎటులుందువులే ॥

17 May - నేడు జమునారాణి బర్త్‌డే

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |