Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

Featured Post

merisE tAraladErUpam - మెరిసే తారలదేరూపం

చిత్రం : సిరివెన్నెల (1987)
రచన : చేంబోలు సీతారామశాస్త్రి (సిరివెన్నెల)
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం


పల్లవి :
మెరిసే తారలదేరూపం
విరిసే పూవులదేరూపం
అది నా కంటికి శూన్యం...
మనసున కొలువై మమతల నెలవై
వెలసిన దేవిది ఏ రూపం
నా కన్నులు చూడని రూపం...
గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం అపురూపం ॥

చరణం : 1
ఎవరి రాకతో గళమున పాటల
ఏరువాక సాగేనో
ఆ వసంత మాసపు కులగోత్రాలను
ఎలకోయిల అడిగేనా
ఎవరి పిలుపుతో పులకరించి పురివిప్పి
తనువు ఊగేనో
ఆ తొలకరి మేఘపు గుణగణాలకై
నెమలి వెదుకులాడేనా
నా కన్నులు చూడని రూపం
గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం అపురూపం

చరణం : 2
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా
గానం పుట్టుక గాత్రం చూడాలా ॥
వెదురును మురళిగ మలచి
ఈ వెదురును మురళిగ మలచి
నాలో జీవననాదం పలికిన నీవే...
నా ప్రాణ స్పందన నీకే నా హృదయ నివేదన ॥

20 May - సిరివెన్నెల బర్త్‌డే

Comments