చిత్రం : భలేతమ్ముడు (1969)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : టి.వి.రాజు
గానం : మహ్మద్ రఫీ, పి.సుశీల
పల్లవి :
నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే (2)
చరణం : 1
అహహా ఆ... అహహా ఆ...
కనులముందున్న రతనాలమూర్తిని
విలువలెరుగక విసిరితిని (2)
కనుల తెరచీ విలువ తెలిసి (2)
మనసే గుడిగా మలచితిని ॥
చరణం : 2
మదిలో విరిసే మమతల మాలలు
చెలిమికి కానుక చేసెదను (2)
ఆరని వలపుల హారతి వెలుగుల (2)
కలకాలం నిను కొలిచెదను॥
చరణం : 3
చిలిపిగ కసిరే...
చిలిపిగ కసిరే చెలియ విసురులో
అలకలు గని నవ్వుకున్నాను అహ్హహ్హ
చేతులు సాచి చెంతకు చేరిన (2)
ఆ చెలినే అందుకున్నాను (2)
నేడే ఈనాడే మురిపించె నన్ను చెలి తానే ॥
31 July - నేడు మహ్మద్ రఫీ వర్ధంతి