చిత్రం : అదృష్టవంతులు (1969)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : కె.వి.మహదేవన్, గానం : ఘంటసాల
పల్లవి :
అయ్యయ్యో బ్రహ్మయ్యా
అన్యాయం చేశావేమయ్యా
ఈ బుల్లోడే బుల్లెమ్మయితే
ఎంత గుమ్ముగా ఉండేదయ్యా యా యా యా! ॥
చరణం : 1
చిక్కని మీగడ తరకల్లాగ చక్కనైన చెక్కిళ్లు
పసినిమ్మ పండులాగా మిసమిసలాడే ఒళ్లు ॥
బెట్టుచూపి గుట్టుదాచే గడసరి సొగసరి కళ్లు
బెట్టుచూపి గుట్టుదాచే గడసరి సొగసరి కళ్లు
కొంత కోడెతనముంది
మరికొంత ఆడతనముంది ॥
చరణం : 2
మూతి చూస్తే మీసమింకా మొలిచినట్టులేదూ
బెదురుచూస్తే ఎవ్వరితోనూ కుదిరినట్టులేదూ ॥చూస్తే॥
ఆ కసరులోనె అలకనవ్వుల విసురు లేకపోలేదు
కొంత చిలిపితనముంది
మరికొంత కలికితనముంది ॥
చరణం : 3
బులిపించే సొగసున్న
ఓ బుల్లోడా నిను చూస్తుంటే
కొమ్ములు తిరిగిన మగాడికే దిమ్మెక్కిపోతుంటే ॥
కన్నెపిల్లలే చూశారా కన్నుగీటక మానేరా (2)
కవ్వించే కౌగిలిలో కరగించక ఒదిలేరా ఓయ్... ॥