Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : విప్రనారాయణ (1954)
రచన : సముద్రాల రాఘవాచార్యులు
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : ఎ.ఎం.రాజా


పల్లవి :
పాలించరా రంగా పరిపాలించరా రంగా
కరుణాంతరంగ శ్రీరంగా (2)
పాలించర రంగా

చరణం : 1
మరువని తల్లివి తండ్రివి నీవని
మరువని తల్లివి తండ్రివి నీవని
నెరనమ్మితిరా రంగా
మొరవిని పాలించే దొరవని
మొరవిని పాలించే దొరవని
శరణంటినిరా శ్రీరంగా
పాలించర రంగా

చరణం : 2
మనసున నీ స్మృతి మాయకమునుపే (2)
కనులను పొరలూ మూయకమునుపే
కనరారా... ఆ... ఆ...
కనరారా నీ కమనీయాకృతి
కనియద మనసారా రంగా
కనియద మనసారా...
పాలించరా రంగా పరిపాలించరా రంగా

చరణం : 3
కరులును హరులును మణిమందిరములు (2)
సురభోగాలను కోరనురా (2)
దరి కనరానీ భవసాగరమును
దాటించుమురా గరుడ తురంగా ॥

19 July - నేడు సముద్రాల సీనియర్ జయంతి



External Link:
R A A G A

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |