చిత్రం : జెంటిల్‌మెన్ (1993)
రచన : రాజశ్రీ, సంగీతం : ఎ.ఆర్.రెహవూన్
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి బృందం
పల్లవి :
కొంటెగాడ్ని కట్టుకో కొంగుకేసి చట్టుకో
కోటి వన్నెలున్న దాన
అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో
వాలుకళ్ల పిల్లదాన
తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు
సిగ్గుల్లో జారిపోవాలీ చీకట్లు ॥॥
చరణం : 1
అందర్నీ దోచే దొంగ నేనేలే
నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే ॥
చిన్నారి మైనా చిన్నదాన
నేగాలం వేశానంటే పడితీరాలెవరైనా
బంగారమంటి సింగారం నీదే
అందం సొంతమైతే లేనీదేదీ లేదే ॥
చరణం : 2
కొన చూపుతోనే వేశావు బాణం
రేపావు నాలో నిలువెల్లా దాహం ॥
కొరగాని వాడితో మనువు మహాభోగం
ఈ మొనగాడే నావాడైతే బతుకు బంగారం
చిగురాకు పరువం సెగరేగె అందం
నీకు కానుకంట ప్రతిరోజూ పండగంట ॥
14 August - నేడు రాజశ్రీ వర్ధంతి
Photo: రాజశ్రీ