Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : మనదేశం(1949)
రచన : సముద్రాల సీనియర్
సంగీతం : ఘంటసాల, గానం : నాగయ్య


నిర్వేదమేలా కన్నీరదేలా (2)
భరతజాతికపూర్వ పర్వమూ ఈ వేళ
నిర్వేదమేలా కన్నీరదేలా...

ఉరికి తుపాకీల గురికీ
ఎదజూపి ఎదిరించి ఎదురుతెన్నులు గన్న ॥
జాతి స్వతంత్రతా దివ్య సుముహూర్తాన (2)
వెనుకంజ లేదు మనది ముందడుగు
నిర్వేదమేలా కన్నీరదేలా...

కడుపారగని కన్నులందుంచుకొని పెంచు
తల్లి మమకారాలు తలవలేరు (2)
కన్నీరుగా కరిగి అల్లాడు ఇల్లాలు (2)
పిల్లపాపల జూచి నిలువబోరు
తల్లి ఇల్లాలు పిల్లలు సర్వసౌఖ్యాలు
దేశమే దేశమ్ము కోసమే
నేడు దేశమ్ము కోసమే...

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |