చిత్రం : రాగమాలిక (1982)
రచన : రాజశ్రీ
సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలు
పల్లవి :
పూజకొరకై విరిసే పూలను తుంచనేల భువిలో
నీ పూజకొరకై విరిసే పూలను
తుంచనేల భువిలో
ఇది ఏ ఘటనో దివిలో సభలో విధి నిర్ణయమో
॥పూజకొరకై ॥
చరణం :
చలిగాలి తొణికేటి పువ్వులజాతి
వడగాలి వసివాడే ఏమానీతి ॥
కోవెల ఉంటే దీపం ఏదీ
దీపం ఉండీ నీ వెలుగే దీ
పొగిలెను సుమ నా ఎదను గరళం
పొరలెను సుమా బాష్పజల గళం
బంగరు కల అది కరిగిన కథ
నా బ్రతుకే మారెను రాయిలా
కనులను ముసిరిన కటిక చీకటుల
మనసున నిండిన వేళలో
విడివడి వెడలెను మురిపెము
ఎద విడి మువ్వల మోహన రవళితో
కలను వడబోసి కన్నముఖ దీపం వెలిగె
మూగదై నా మదిలోనె ॥
Photo : రాజశ్రీ