చిత్రం : సూర్య /o కృష్ణన్ (2008)
రచన : వేటూరి
సంగీతం : హారీస్ జయరాజ్
గానం : క్రిష్, బెన్నీ దయాల్, భార్గవి పిళ్లై
పల్లవి :
ఎదనే కొయ్యకే సొగసే జల్లకే
జగమే చిన్నదై జతలో ఒదిగెనే
నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము
నాలోన గిలిగింతే
తెల్లారే ఉదయం సందేళ ఆకాశం
నీకోసం వేసారే
చరణం : 1
అధరం మధురం సమ్ముఖం
నన్ను నీైడె తరుముతూవుంటే
మదటే ముడిైవె నీవెగా
తెలిసిపోయే వలపు కథ ఏదో
వసంతకాలమే వచ్చే సంతోషమొచ్చెనే
మరి మురిసిపోయెనే
ఊరించి కనులలో ఏవో మెరుపేదో
అన్నదే నను మీటి పోయెనే
మంచు వర్షాల తడిసి
ఎద ఉప్పొంగి మైమరిచే
నిన్నే చూసి నన్నే మరిచానే
చరణం : 2
అందం చందం నీదిలే
కొంచెం అందుకే ఒదిగి నడిచానే
చెలియా నువ్వే చెప్పవే
ఈ నిమిషం నిన్ను వలచానే
తీయని మాటే స్వర్గమే
ఫించాలు విప్పినా నెమలెంట నేనులే
ఆకాశమే నీలం తన రంగు మార్చదా
సిందూరమవ్వదా
నాకోసమే వచ్చి నువు నా నీడగ మారి
నువ్వే ఓడి నన్నే గెలిచావే