kalalOnainA kalaganalEdE - కలలోనైనా కలగనలేదే
చిత్రం : నువ్వువస్తావని(nuvvu vastAvani) (2000)రచన : చంద్రబోస్(chandrabOse)
సంగీతం : ఎస్.ఎ.రాజ్‌కుమార్(A.A.rAj kumAr)
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం(S.P.bAlasubrahmaNyam)
పల్లవి :
కలలోనైనా కలగనలేదే నువ్వువస్తావని
మెలకువలోనైన అనుకోలేదే
నువ్వువస్తావని ॥
ఆ దేవుడు కరుణించి
ఈ దేవత కనిపించి
ఆనందం కలిగించి
ఈ బంధం కదిలొచ్చి
ప్రేమపైన నమ్మకాన్ని నాలో
పెంచుతున్నది
నను కమ్మనైన అమృతాల
నదిలో ముంచుతున్నదీ
ఓహో... హోహో... హేహే...॥
చరణం : 1
చిన్ని పెదవిపైన పుట్టుమచ్చ కానా
చిన్ని తేనె నవ్వులలోన స్నానాలాడనా
కన్నెగుండెపైన పచ్చబొట్టు కానా
మోగుతున్న సవ్వడి వింటూ
మోక్షం పొందనా
జానకి నీడే రాముని మేడ
నీ జారిన పైటే నే కోరిన కోట
తెలుగు భాషలోన
వేల పదములు కరుగుతున్నవి
నా వలపు భాషలోన
చెలియ పదమే మిగిలివున్నదీ
ఓహో... ఓహో... ॥
చరణం : 2
కాళిదాసు నేనై కవిత రాసుకోనా
కాలిగోటి అంచులపైన
హృదయం ఉంచనా
భామదాసు నేనై ప్రేమకోసుకోనా
బంతిపూల హారాలేసి ఆరాధించనా
నా చెలి నామం తారకమంత్రం
చక్కని రూపం జక్కన శిల్పం
వందకోట్ల చందమామలొకటై
వెలుగుతుండగా
ఈ సుందరాంగి చూపు సోకి కాదా
బ్రతుకు పండగా
ఓహో... ఓహో... ॥