Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : ఒకటో నెంబర్ కుర్రాడు (2002)
రచన : చంద్రబోస్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : ఎస్.పి.చరణ్ , చిత్ర, బృందం

పల్లవి :
ఒరేయ్ నువ్వునాకు నచ్చావురా
ఒరేయ్ ఐ లవ్ యూ రా...
ఒరేయ్ నేను నిన్ను మెచ్చానురా
ఒరేయ్ అదంతేరా
అరరె చురుకు నీకు ఉందిరా
అసలు కొత్త స్టైల్ నీదిరా
అందుకే ఐ లవ్ యూ రా...
ఆడపిల్ల ఒరేయ్ అందంటే
ప్రేమలోని పడ్డట్టేరా
నీ రొట్టె విరిగి ఎంచక్కా నేతిలోన
పడిపోయేరా
చరణం :
1 ఎంట్రా గూట్లే... ఆహాహా
ఎంత ప్రేమగా పిలిచిందో చూడరా
ఏంట్రా గూట్లే టెలిఫోన్ పోలల్లే
ఎదిగావురా
పోరా డోంగ్రి ఐస్‌ఫ్రూట్ పుల్లల్లే
అదిరావురా
ఏంట్రా టుమ్రీ తొక్కలోది
నీ డ్రస్సే బాగుందిరా
పోరా పుస్కీ దిక్కుమాలిన
నీ ఫేసే సూపర్బ్‌రా
ఏరా లఫంగి నువ్వేరా
ఏరా పుడింగి నీ పేరా
బే అన్న బేవర్సన్నా
బచ్చా అన్నా బడవా అన్నా
ప్రతిమాట పరమార్థం ప్రేమేరా
ఆహా మీ తిట్లే వింటుంటే
ప్రేమ ముదిరినట్టుందిరా
ఓహో మీరు మాకు హ్యాపీగా
బీరు పార్టీ ఇచ్చుకొండిరా
ఒరేయ్... ఒరేయ్...
ఒరేయ్ చిలక రూటుకొచ్చిందిరా
ఒరేయ్ ఇక వెళ్లండిరా
ఒరేయ్ చిలిపి చిలిపి పనులున్నాయ్‌రా
ఒరేయ్ కళ్లు మూయండిరా...

చరణం : 2
ఏంట్రా మెంటల్... ఓహొహో
ఏం ముద్దుగా పిలిచావ్ పిల్లోయ్
ఏంట్రా మెంటల్ చల్లనైన నీ మనసే
ఎయిర్ కూలర్ రా
పోరా కిండల్ దూకుతున్న నీ వయసే
టూవీలర్ రా
రారా ఉల్ఫా కాల్చుతున్న చూపే
సిగరెట్ లైటర్ రా
పోరా పిస్తా చిక్కుకున్న నడుమే
సెంటీమీటర్ రా
నా దేశముదురు నువ్వేరా
నా చేదు షుగరు ఇలా రా
ఇడియట్ అన్నా స్టుపిడ్ అన్నా
ట్యూబ్‌లైట్ అన్నా ఎల్‌బోర్డ్ అన్న
ప్రతి తిట్టు ప్రేమలోన దీవెనేరా
డౌట్ లేదు వీళ్లు మనకు లేనట్టేరా

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |