పల్లవి :
మంటలు రేపే నెలరాజా...
ఈ తుంటరితనము నీకేలా (2)
వలపులు రేపే విరులారా...
ఈ శిలపై రాలిన ఫలమేమి
॥
చరణం : 1
ఆకాశానికి అంతుంది...
నా ఆవేదనకు అంతేదీ (2)
మేఘములోన మెరుపుంది...
నా జీవితమందున వెలుగేదీ
॥
చరణం : 2
తీగలు తెగిన వీణియపై...
ఇక తీయని రాగం పలికేనా (2)
ఇసుక ఎడారిని ఎపుడైనా...
ఒక చిన్న గులాబీ విరిసేనా
॥
చరణం : 3
మదిలో శాంతి లేనపుడు...
ఈ మనిషిని దేవుడు చేశాడు (2)
సుఖము శాంతి ఆనందం...
నా నొసటను వ్రాయుట మరిచాడు
॥
చిత్రం : రాము (1968)
రచన : దాశరథి
సంగీతం : ఆర్.గోవర్ధన్
గానం : ఘంటసాల