ఆ ఆ ఆ
ఆకులో ఆకునై పూవులో పూవునై కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా ||ఆకులో||
గలగల నీ వీచు చిరుగాలిలో కెరటమై
గలగల నీ వీచు చిరుగాలిలో కెరటమై
జలజల నీ పారు సెల పాటలో తేటనై
పగడాల చిగురాకు తెరచాటు చేటినై
పరువంపు విడిచేడే చిన్నారి సిగ్గునై
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఎచటనే ఆగిపోనా ||ఆకులో||
తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
చగలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఆకలా దాహమా చింతలా వంతలా
ఈ తరలీవెర్రినై ఏకతమా తిరుగాడా
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఎచటనే ఆగిపోనా ||ఆకులో||
చిత్రం : మేఘసందేశం
గానం : పి.సుశీల
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం: రమేష్‌నాయుడు