Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని పొద్దున్నే మా తోటలోనికి వెళ్ళాను ప్రభూ ఉదయశ్రీ అరుణారుణ కాంతులతో ఉద్యానవనం కలకలలాడుతోంది పూల బాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి అప్పుడు

నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి
గోరానెడు నంతలోన విరులన్నియు జాలిగ
నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు
బావురుమన్నవి కృంగిపోతి నా
మానసమందేదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై

అంతలో ఒక సన్నజాజికన్నె సన్నని
గొంతుకతో నన్ను చూసి యిలా అంది ప్రభు


ఆయువుగల్గు నాల్గు గడియల్ కనిపించిన తీవతల్లి
జాతీయత దిద్ది తీర్తుము తదీయ కరమ్ములలోన
స్వేచ్చ్చమై ఊయల లూగుచున్ మురియుచుందుము
ఆయువు తీరినంతనే హాయిగ కన్ను మూసెదము
ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై

ఎందుకయ్యా మా స్వేచ్చ జీవనానికి అడ్డు వస్తావు
మేము నీకేం అపకారము చేసాము


గాలిని గౌరవింతుము సుగంధము పూసి
మమ్మాశ్రయించు బృంగాలకు విందు చేసెదము
కమ్మని తేనెలు మిమ్ముబోంట్ల నేత్రాలకు హాయి
గూర్తుము స్వతంత్రులు మమ్ముల స్వార్ధబుద్ధితో తాలుము
త్రుంచ బోకుము తల్లికి బిడ్డకి వేరుచేతువే

యింతలో ఒక గులాబి బాల కోపంతో
మొగమంతా ఎర్రబడి యిలా అంది ప్రభూ..
ఊలు దారాలతో గొంతుకురి బిగించి గుండెలోనుండి
సూదులు గుచ్చి కూర్చి, ముడుచుకొందురు ముచ్చట
ముడుల మమ్ము అకట దయలేనివారు మీ యాడవారు


పాపం మీరు దయాదాక్షిణ్యాలుగల మానవులు కావోలునే

మా వెలలేని ముగ్ధసుకుమార సుగంధ మరంద మాధురీ
జెవితమెల్ల మీకయి త్యహించి కృశించి నశించిపోయే
మా యౌవనమెల్ల కొల్లగొని ఆపై చీపురుతోడ చిమ్మి
మమావల పారబోతురుగదా నరజాతికి నీతియున్నదా

:వోయీ మానవుడా

బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
సహజమంగు ప్రేమ నీలోన చచ్చ్చేనేమి
అందమును హత్య చేసి హంతకుండా
మైలపడిపోయెనో నీ మనుజ జన్మ

అని దూషించు పూలకన్నియల కోయలేక
వట్టిచేతులతో వచ్చిన నాయీ హృదయ కుసుమాంజలి
గైకొని నాపై నీ రేఖలను కరుణశ్రీ
ప్రసరింపుము ప్రభు.

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |