Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : అద్దాలమేడ (1981)
రచన : దాసరి నారాయణరావు
సంగీతం : రాజన్-నాగేంద్ర
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి


పల్లవి :
నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది
నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది
అది ఊహల లోకములో కవితలు రాస్తుంది
ఆ కవిత కావ్యమై కావ్యానికి నాయికవై
వరించి తరించి ఊరించక రావే కావ్యనాయిక ॥జీవిత॥

చరణం : 1
నేను కవిని కాను కవిత రాయలేను
శిల్పిని కాను నిను తీర్చిదిద్దలేను
చిత్రకారుని కానే కాను
గాయకుణ్ణి అసలే కాను
ఏమీకాని నేను నిను కొలిచే పూజారిని
నీ గుండెల గుడిలో ప్రమిదను పెట్టే పూజారిని
నీ ప్రేమ పూజారిని ॥జీవిత॥

చరణం : 2
నేను రాముణ్ని కాను విల్లు విరచలేను
కృష్ణుణ్ని కాను నిను ఎత్తుకు పోలేను
చందురుణ్ని కానే కాను
ఇందురుణ్ని అసలే కాను
ఎవరూ కాని నేను నిను కొలిచే నిరుపేదను
అనురాగపు దివ్వెలు
చమురును నింపే ఒక పేదను
నే నిరుపేదను... ॥జీవిత॥

24 June - నేడు మురళీమోహన్ బర్త్‌డే

Listen Song: nA jIvita gamanamulO

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |