Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

Featured Post

pADeda nI nAmamE - పాడెద నీ నామమే

చిత్రం : అమాయకురాలు (1971)
రచన : దాశరథి
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : పి.సుశీల


పల్లవి :
ఆ... ఆ ఆ ఆ... ఆ ఆ ఆ... ఆ...
పాడెద నీ నామమే గోపాలా (2)
హృదయములోనే పదిలముగానే
నిలిపెద నీ రూపమేరా
పాడెద నీ నామమే గోపాలా

చరణం : 1
మమతలలోనే మాలికలల్లి
నిలిచితి నీకోసమేరా
ఆశలతోనే హారతి చేసి
పదములు పూజింతు రారా
పాడెద నీ నామమే గోపాలా

చరణం : 2
నీ ముర ళీ గానమే పిలిచెరా
కన్నుల నీమోము కదలెనులేరా
నీ ముర ళీ గానమే పిలిచెరా
పొన్నలు పూచే బృందావనిలో
వెన్నెల కురిసే యమునాతటిపై (2)
నీ సన్నిధిలో జీవితమంతా
కానుక చేసేను రారా ॥

12 June - నేడు శారద పుట్టినరోజు

Comments