Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : పెళ్లిపందిరి (1997), రచన : సిరివెన్నెల
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
గానం : ఎస్.పి.బాలు, మనో


పల్లవి :
దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్
వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం
బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం
స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం


చరణం : 1
నిదరలో ఇద్దరము ఒకేలా కలగంటాం
ఆహాహా ఆహా ఎహేహే ఎహే
నిజంలో ప్రతిక్షణం కలలకే కల అవుతాం
ఓహోహో ఓహో ఆహాహా ఆహా
హే వేరల్లే నేనొదిగుంటా
నువు ఎదుగుతూ ఉంటే
మబ్బుల్తో మన కథ చెబుతా
వింతగ వింటుంటే
నీలానాలా సావాసంగా నింగీనేల
మబ్బై కరిగి ఇలపై జల్లైరాదా
మన్నూ మిన్నూ కలిపే హరివిల్లవదా ॥

చరణం : 2
చరిత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది
ఆహాహా ఆహా ఓహోహో ఓహో
ధరిత్రికి ఈ చెలిమి ప్రమాణం అంటుంది
ఓహోహో ఓహో హేహేహే హేహే
హే ప్రాణానికి ప్రాణంపోసే
మంత్రం రా స్నేహం
స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం
ఊరూవాడా ఔరా అంటూ
ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే
రాదా నేస్తం కాలం చదవని కావ్యం
లోకం మొత్తం చదివే ఆరో వేదం ॥

Click to Play:


Download:
Dost Mera Dost.mp3

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |