చిత్రం : హలోబ్రదర్ (1994), రచన : భువనచంద్ర
సంగీతం : రాజ్-కోటి, గానం : బాలు, బృందం
పల్లవి :
కన్నెపెట్టరో కన్ను కొట్టరో... ఓ ఓ ఓ...
పాలపిట్టరో పైట పట్టరో... ఓ ఓ ఓ...
అరె అరె అరె... ॥
గుట్టు గుట్టుగా జట్టుకట్టరో
జంట చేరితే గంట కొట్టరో
ఒట్టు గిట్టు పెట్టావంటే ఊరుకోను
బెట్టె కట్టి ఉట్టె కొట్టి తీరతాను ఓ ఓ ఓ ఓ...
చరణం : 1
చూపు చూపుకొక చిటికల మేళం
చూసి పెట్టనా చిట్టెమ్మో
ఊపు ఊపుకొక తకదిమి తాళం
వేసిపెట్టనా చెప్పమ్మో
అదిరిపడిన కుడి ఎడమల నడుమున
ఉడుకు వయసు ముడి పెట్టుకోనా
అసలు సిసలు లవ్ కిటుకులు తెలిసిన
పడుచు పనులు మొదలెట్టుకోనా
అదిరే సరుకు ముదిరే వరకు
అటో ఇటో ఎటో ఎటో పడి పడి
కలేయనా అదో ఇదో కలబడి॥
చరణం : 2
గంప తిరగబడి గలగలమంటే
గువ్వ గుండెలో రింజింజిం
వేడి వేడి ఒడి చెడుగుడు అంటే
సోకులాడి పని రంపంపం
మిడిసిపడిన తడి తలుపుల మెరుపులు
మెరిసి మెరిసి పని పట్టమంటే
వదులు చెడిన చెలి జిగిజిగి బిగువులు
అరిచి అరిచి మొరపెట్టుకుంటే
పనిలో పనిగా ఒడిలో పడనా
చలో చలో ఎకా ఎకి చం చం
కలేసుకో ప్రియా ప్రియా కం కం ॥
Photo:రాజ్, కోటి