Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : రాము (1968), రచన : దాశరథి
సంగీతం : ఆర్.గోవర్ధన్, గానం : పి.సుశీల


పల్లవి :
మామిడికొమ్మ మళ్లీ మళ్లీ పూయునులే
మాటలు రాని కోయిలమ్మ పాడునులే
ఆనందంతో అనురాగంతో నా మది ఆడునులే ॥

చరణం : 1
నన్నే నీవు అమ్మ అన్ననాడు
మీ నాన్న మనసు గంతులు వేసి ఆడు ॥
మంచికాలం మరలా రాదా
ముళ్లబాటే పూలతోట
ఆనందంతో అనురాగంతో నా మది ఆడునులే ॥

చరణం : 2
గూటిలోని పావురాలు మూడు
అవి గొంతు కలిపి తీయని పాట పాడు ॥
మంచు తెరలు తొలగిపోయి
పండువెన్నెల కాయునులే
ఆనందంతో అనురాగంతో నా మది ఆడునులే ॥

30 August - నేడు జమున పుట్టినరోజు

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |