Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : సంకీర్తన (1987), రచన : సిరివెన్నెల
సంగీతం : ఇళయరాజా, గానం : బాలు,జానకి


సాకీ :
మనసున మొలిచిన సరిగమలే
ఈ గలగల నడకల తరగలుగా
నా కలలను మోసుకు నినుచేరి
ఓ కమ్మని ఊసుని తెలిపేనే
కవితవు నీవై పరుగున రా
ఎద సడితో నటియించగ రా
స్వాగతం సుస్వాగతం (2)

పల్లవి :
కూకూ చుకు చుకు కూకూ చుకు చుకు
కూకూ చుకు చుకు కూకూ
రారా స్వరముల సోపానములకు
పాదాలను జత చేసి
కుకుకూ కుకుక్కూ కీర్తన తొలి ఆమనివై రా
పిలిచే చిలిపి కోయిలా ఎట దాగున్నావో ॥
మీ నృత్యం చూసి నిజంగా... నిజంగా

చరణం : 1
మువ్వల రవళి పిలిచింది
కవిత బదులు పలికింది
కలత నిదుర చెదిరింది
మనసు కలను వెతికింది
వయ్యారాల గౌతమి...
వయ్యారాల గౌతమి ఈ కన్యారూప కల్పన
వసంతాల గీతినే నన్నే మేలుకొల్పిన
భావాల పూల రాగాల బాట నీకై వేచేనే ॥
ఏదో స్వరగతి నూతన పదగతి చూపెను
నను శ్రుతి చేసి
ఇది నా మది సంకీర్తన కుకుకూ కుకుక్కూ
సుధలు రేయాలాపాన కుకుకూ కుకుక్కూ ॥

చరణం : 2
లలిత లలిత పదబంధం మదిని
మధుర సుమగంధం
చలిత మృదుల పదలాస్యం
అవని అధర దరహాసం
మరందాల గానమే
మరందాల గానమే మృదంగాల నాదము
ప్రబంధాల ప్రాణమే నటించేటి పాదము
మేఘాల దారి ఊరేగు ఊహ వాలే ఈ మ్రోల ॥॥॥

29 August - నేడు నాగార్జున బర్త్‌డే

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |