Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : తీన్‌మార్ (2011)
రచన : రామజోగయ్యశాస్త్రి, సంగీతం :మణిశర్మ
గానం : హేమచంద్ర, శ్రీవర్ధిని, బృందం


పల్లవి :
జై బోలో
శంకర మహారాజ్‌కీ
బోలో కాశీవిశ్వనాథ్‌కి
హర హర హర హర మహదేవ్ ॥బోలో॥
శ్రీ గంగా నీలాంటి మనసీయవే
జన్మంతా నీ బాట నడిపించవే
శివపూజను... శివపూజను కరుణించవే
ప్రియసేవలో తరియించు వరమియ్యవే
కాశీ వాసా సాంబశివ కాచే తండ్రి మహదేవా
పొంగే గంగే నీ చలవ కరుణకు లేదే ఏ కొదవ
మదిలో కోరిక తీరే మార్గం కావా
జై బోలో శంకర మహారాజ్‌కి
హర హర మహాదేవ్
జగమేలు శివశంకరా...
జగమేలు శివశంకరా
నువ్వుంటే మాకింక భయమేందిరా
ఎద నిండుగా నువ్వుండగా
చిరునవ్వులన్నీ మావేరా
నీ కంటిచూపు చిటికేస్తే చాలు
కలగన్న మాట నిజమైపోతదిరా ॥

చరణం : 1
నిప్పు నీరు రెంటినీ...
నిప్పు నీరు రెంటినీ జతగా నిలిపావుగా
విడ్డూరం చూపావుగా నీ లీలతో
నెలవంకకు తోడుగా వెలుగై నువ్వుండగా
అమావాస్య లేదుగా కలలో ఇలలో
నీవే దైవం ఊపిరికి నీదే భారం ఎన్నటికీ
ఆలోచనలో నీ ఉనికి ఆశాదీపం రేపటికి
నీ దయ పొందిన పుణ్యం మాదైపోనీ ॥బోలో॥॥
సనిపని సరి సనిపని సరి మపనిసా (2)
రిసనిస రిమ రిసనిస రిమ పనిసరి (2)
సరిసని దనిపమ గమనిప మగరినిసా (2)

చరణం : 2
ఆరాధించే తొందర...
ఆరాధించే తొందర ఆగే వీల్లేదురా
మారేడై మనసుందిరా నీ ముందర
నీ చల్లని నీడలో నెలవుంటే చాలురా
అభయంగా ఇయ్యరా అడిగే ఆసరా
వీచే గాలే సాక్ష్యమట నింగి నేలే సాక్ష్యమట
ఆత్మాదేహం ఒక్కటిగా నీలా రూపం దాల్చెనట
ప్రణవం నువ్వై ప్రాణం పొందెను ప్రేమ ॥బోలో॥॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |