చిత్రం : దేవత (1982), రచన : వేటూరి
సంగీతం : చక్రవ ర్తి, గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల
పల్లవి : ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లాకిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో
కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
ఓరయ్యో... రావయ్యో...
ఆగడాల పిల్లోడమ్మా సోగ్గాడా
మీగడంత నీదే లేరా బుల్లోడా ॥
కొంగుచాటు అందాలన్నీ పేరంటాలే చే స్తుంటే
ఓలమ్మో... రావమ్మో...
ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడూ
ఆగడాల పిల్లోడైనా నీవోడూ
చరణం : 1 ఈ కళ్లకున్న ఆ కళ్లలోన
అందాల విందమ్మ నువ్వు
వాటేసుకుంటే వందేళ్ల పంట
వద్దంటే విందమ్మ నవ్వు
చెయ్యెస్తే చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ చెయ్యెస్తే చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ
ఈడొచ్చి నీ చోటు ఈడుంది రమ్మంటే
యేడేసుకుంటావు గూడు
కౌగిళ్లలో నన్ను చూడు ఆకలికుంటాది కూడు
గుండెల్లో చోటుంది చూడు॥॥॥మంటే॥
చరణం : 2
నీ కళ్ల సోక నా తెల్ల కోక అయ్యిందిలే గళ్ల కోక
నీ మాట విన్న నా జారు పైట
పాడిందిలే గాలి పాట
కళ్లల్లో ఉన్నాయి ముళ్లు నే కోరిన మూడుముళ్లు కళ్లల్లో ఉన్నాయి ముళ్లు నే కోరిన మూడుముళ్లు
పొద్దుల్లో కుంకాలు బొట్టెట్టి పోతుంటే
కట్టెయ్యనా తాళిబొట్టు
నా మాటకీయేరు తోడు ఏరెండినా ఊరు తోడు
నీ తోడులో ఊపిరాడు॥॥॥