Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : సరిగమలు (1994), రచన : వేటూరి
సంగీతం : బాంబే రవి, గానం : ఎస్.పి.బాలు, చిత్ర


పల్లవి :

గోదావరిపై ఎద కృష్ణమ్మ నీ వాల్జడ
నిండారి తెలుగింటి అందాలే వెలిగించే
నండూరి వారెంకిలా ఓ...
గోదావరి ఎన్నెలా నాదారిలో కాయగా
ఉప్పొంగే పరువాల ఉయ్యాల కెరటాల
కిన్నెరసాని పాటలా ఓ...॥

చరణం : 1

సిగ్గల్లే పండెనులే సాయంత్రము
బుగ్గల్లో పండాలి తాంబూలము॥
ఎన్నెల్లె కోరుకునే ఏకాంతము
నన్నల్లుకోమంది వయ్యారము
కౌగిలిలో మేలుకొనే కానుకవో మేనకవో
నా స్వప్న లోకాలలో
గోదావరి ఎన్నెలా నాదారిలో కాయగా

చరణం : 2

గువ్వమ్మ చేరుకునే శ్రీగోపురం
మువ్వమ్మ మురిసేటి మురళీపురం ॥
కవ్వాలే కడవల్లో కదిలే క్షణం
కడలల్లే పొంగింది నా మానసం
పొన్నలలో పొగడలలో తుంటరివో తుమ్మెదవో
నా బాహు బంధాలలో ॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |