చిత్రం : వసంతం (2003), రచన : వేటూరి
సంగీతం : ఎస్.ఎ.రాజ్‌కుమార్
గానం : ఉదిత్ నారాయణ్, సుజాత
పల్లవి :
జాంపండువే దోర జాంపండువే
పూ చెండువే మల్లె పూ చెండువే
నీ పాలబుగ్గ ఎర్రమొగ్గలేస్తే
నా మనసున తైతక్క
రవి చూడని రవికను చూస్తే
నా వయసుకు తలతిక్క
జాంపండునే దోర జాంపండునే
పూచెండునే మల్లె పూచెండునే
చరణం : 1
ఊగింది ఊగింది నా మనసు ఊగింది
నీకంటి రెప్పల్లో అవి ఏం చిటికెలో
అవి ఏం కిటుకులో
ఉరికింది ఉరికింది నా వయసు ఉరికింది
నీ నడుము ఒంపుల్లో అవి ఏం కులుకులో
అవి ఏం మెలికలో
ఇది పంచదార చిలకా అంచులన్నీ కొరకా
మీదికొచ్చి వాలమాకా
ఓ చందనాల చినుకా కుందనాల మొలకా
కోక డాబు కొట్టమాకా
నువ్వే నేనుగా తిరిగాం జంటగా
నిప్పే లేదుగా రగిలాం మంటగా
॥॥చెండువే॥
చరణం : 2
ఒళ్లంత తుళ్లింతై చెమటెంత పడుతున్నా
ఆ చెమట చేరని చోటు చూపించవే
అది చూపించవే
కళ్లంత కవ్వింతై ఓ వింత చెబుతున్నా
ఆ చెమట చేరని చోటు ఈ పెదవులే
కొరికే పెదవులే
నువ్వు ఆడ సోకు చూపి ఈడ కొంత దాచి
కుర్రగుండె కోయమాకా
నన్ను కౌగిలింతలడగ కచ్చికొద్దీ కొరకా
కన్నె సైగ కోరమాకా
మరుగే ఉందిగా చొరవే చేయగా
పరువేం పోదుగా ఒడిలో చేరగా ॥
నా పాలబుగ్గ ఎర్రమొగ్గలేస్తే
నీ మనసున తైతక్క
రవి చూడని రవికను చూస్తే
నీ వయసుకు తలతిక్క ॥