చిత్రం : మన్మధ (2005),
రచన : వేటూరి
సంగీతం : యువన్‌శంకర్‌రాజా
గానం : ఎస్.పి.చరణ్
పల్లవి : కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే
ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా
తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే
ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా
నీ మనసులో పూసే పూవుల్లో
ఘుమఘుమంతా వలపే అనుకున్నా
ఈ వయసులో వీచే గాలుల్లో
సరిగమంతా పిలుపే అనుకున్నా
నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో
నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో
నా పాపలాగా కళ్లల్లో దాచానో నా గుండె నీకే
ఇల్లల్లే చేశానో నా ప్రేమా ॥
చరణం : 1 పూల మనసులో గాలి ఎరుగదా
నిన్ను పరిచయం చేయాలా
మేఘమాలలో మెరుపుతీగవై
నీవు పలికితే ప్రణయాలా
శతకోటి కాంతలొస్తే భూమికే పులకింత
ఒక చూపు చాలదా మనసు దోచిన జోలగా
నిను తలచి వేచిన వేళ
పదముల కదలదు కాలం
కన్నీటి వర్షం మధురం కాదా బాధైనా
తండ్రి నీవెయై పాలించు తల్లి నీవెయై లాలించు
తోడు నీడవై నను నడుపు గుండెల్లో
కొలువుండే దేవి ॥చిట్టి॥॥
చరణం : 2 నీవు తప్ప నాకెవరు లేరులే
ప్రాణమివ్వనా నీకోసం
ఆశలాంటి నీ శ్వాస తగిలితే
బతికి ఉండదా నా ప్రాణం
నీ మోము చూడక నా కనులు వాలవే
విరహవేళలో పగలు చీకటై పోయెనే
తను మనః ప్రాణాలన్నీ నీకు నే నర్పిస్తాలే
నీ కొరకు పుడితే చాలు మళ్లీ మళ్లీ
చెలియ నీ పేరు పక్కనిలా రాసినానులే నా పేరే
అది చెరిగిపోకుండ గొడుగువలె
నేనుంటె వానెంతలే
నా చిట్టి ప్రేమా... ॥
Kadanna Preme ~ Manmadha | Yuvan Shankar Raja | S.P. Charan
Watch In HD :
Kadanna Preme ~ Manmadha